‘డ్రాగన్’ సినిమాలో మలయాళ ముద్దుగుమ్మ!

by Mallepaka Hamsa |

మలయాళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి దర్శన రాజేంద్రన్ ‘డ్రాగన్’ చిత్రంలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.

‘డ్రాగన్’ సినిమాలో మలయాళ ముద్దుగుమ్మ!
X

దిశ, సినిమా: యంగ్ టైగర్ ఎన్టీఆర్- సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘డ్రాగన్’. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోందిఈ సినిమా గురించి తాజాగా ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. మలయాళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి దర్శన రాజేంద్రన్ ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఆమె ఇప్పటికే షూటింగ్‌లో కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది.

మూవీలో ఆమె పాత్ర చాలా ఎమోషనల్‌గా, కథను మలుపు తిప్పే విధంగా ఉంటుందని సమాచారం. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా.. జూలై నెలలో చిత్ర యూనిట్ శ్రీలంక వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అక్కడ ఒక భారీ షెడ్యూల్‌ను ప్లాన్ చేశారట. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా, రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఈ ఏడాది షూటింగ్ పూర్తి చేసుకుని, వచ్చే ఏడాది అంటే 2027, జూన్ 11న ‘డ్రాగన్’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.

Next Story