- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘స్పిరిట్’ సినిమాలో మలయాళ భామ ఫిక్స్.. ఏ పాత్రలో చేయనుందంటే?
మలయాళ యంగ్ బ్యూటీ మడోన్నా సెబాస్టియన్(Madonna Sebastian) ‘ప్రేమమ్’చిత్రంతో ఇండస్ట్రీకి వచ్చింది.

దిశ, సినిమా: మలయాళ యంగ్ బ్యూటీ మడోన్నా సెబాస్టియన్(Madonna Sebastian) ‘ప్రేమమ్’చిత్రంతో ఇండస్ట్రీకి వచ్చింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుంది. ఇక తెలుగులో ‘ప్రేమమ్’రీమేక్‌లో నాగచైతన్య సరసన నటించింది. అలాగే ‘శ్యామ్ సింగరాయ్’లో కీలక పాత్రలో నటించి మెప్పించింది. ఈ అమ్మడు గత రెండేళ్లుగా సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. ఈక్రమంలో.. తాజాగా, మడోన్నా ఓ బంపర్ ఆఫర్ అందుకున్నట్లు సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్ అవుతున్నాయ.
మడోన్నా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas)తో స్క్రీన్ షేర్ చేసుబోతున్నట్లు సమాచారం. సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’లో ఈ అమ్మడు కీలక పాత్రలో నటిస్తున్నట్లు టాక్. ఇక ఇందులో బాలీవుడ్ యంగ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తుండగా.. మడోన్నాను కీలక పాత్ర కోసం మూవీ టీమ్ సంప్రదించినట్లు తెలుస్తోంది. ఆమెకు స్టోరీ నచ్చడంతో నటించేందుకు ఒప్పుకున్నట్లు టాక్. ప్రస్తుతం ఆ అమ్మడుకి సంబంధించిన పోస్టులు నెట్టింట వైరల్ అవుతుండటంతో అది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.






