హారర్ సినిమాతో రాబోతున్న మాళవిక మనోజ్.. ఆసక్తి పెంచుతున్న పోస్టర్

by Mallepaka Hamsa |   (  Updated:2025-08-10 14:41:36  IST  )

మలయాళ బ్యూటీ మాళవిక మనోజ్(Malavika Manoj) ‘జో’ మూవీతో ఓవర్ నైట్ స్టార్‌గా మారింది.

హారర్ సినిమాతో రాబోతున్న మాళవిక మనోజ్.. ఆసక్తి పెంచుతున్న పోస్టర్
X

దిశ, సినిమా: మలయాళ బ్యూటీ మాళవిక మనోజ్(Malavika Manoj) ‘జో’ మూవీతో ఓవర్ నైట్ స్టార్‌గా మారింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక ఇటీవల ఈ అమ్మడు ‘ఓ భామ అయ్యో రామ’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. కానీ హిట్ రాబట్టుకోలేకపోయింది. అయినప్పటికీ మాళవిక నటనకు మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం ఈ భామ వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్‌గా మారింది. మాళవిక ఓ హారర్, కామెడీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రకటించింది. హిట్ మూవీ ‘సుమతి వలవు’(Sumati Valavu-2) సీక్వెల్‌లో నటిస్తున్నట్లు తెలిపింది. అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా షేర్ చేసింది.

ఇందులో ఓ అడవిలో అమ్మాయి ముఖం ఆకారం కనిపించగా.. దారిలో కొందరు నడుస్తున్నట్లు ఉన్న పోస్టర్ అందరినీ భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఈ సినిమాకు విష్ణు శశి శంకర్ (Vishnu Shashi Shankar)దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఇందులో బాలు వర్గీస్, గోకుల్ సురేష్, సైజు కురుప్, మాళవిక మనోజ్, శివద, గోపిక, నిరంజ్ మణియన్‌పిళ్లై, సిద్ధార్థ్ భరతన్, బాబీ కురియన్, శ్రవణ్ ముఖేష్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని వాటర్‌మ్యాన్ ఫిల్మ్స్ ఎల్‌ఎల్‌పి, శ్రీ గోకులం మూవీస్, మురళి కున్నుంపురత్, గోకులం గోపాలన్‌ల సహకారంతో ఈ మలయాళ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Next Story