- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చీప్ కామెంట్స్ చేస్తున్నారు.. మలైకా అరోరా అసంతృప్తి
ప్రజలు తనను చూసే విధానంపై మలైకా అరోరా అసంతృప్తి వ్యక్తం చేసింది. తనను ‘సెక్సీ బాంబ్‌షెల్’గా గుర్తించడాన్ని ఏ రోజు సీరియస్‌గా తీసుకోలేదని, అయినప్పటికీ ఆ సాకుతో కొందరు చీప్ కామెంట్స్

X
దిశ, సినిమా : ప్రజలు తనను చూసే విధానంపై మలైకా అరోరా అసంతృప్తి వ్యక్తం చేసింది. తనను ‘సెక్సీ బాంబ్‌షెల్’గా గుర్తించడాన్ని ఏ రోజు సీరియస్‌గా తీసుకోలేదని, అయినప్పటికీ ఆ సాకుతో కొందరు చీప్ కామెంట్స్ చేయడం బాధించిందని చెప్పింది. అలాగే తాను అంతర్గత కలహాలతో సతమతమవుతున్నపుడు కూడా ‘సెక్సీ బాంబ్’ పేరుతోనే కామెంట్స్ చేయడం దారుణమని పేర్కొంది. ‘జనాలు నా గురించి చాలా రకాలుగా అనుకుంటారు. నాకు గొప్ప శరీరం, మంచి ముఖం ఉందని వాళ్లంతా భావించినప్పటికీ నేను చాలా చిత్రాల నుంచి వైదొలిగాను. కానీ, నా విశ్వాసం ఎప్పుడూ నాకు సమస్యగా మారలేదు. ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటూ తెలివిగా వ్యవహరిస్తున్నాననే ఫీల్ అవుతాను. మరింత ఎదగడం లేదని బాధపడలేదు. ఎందుకంటే నాకు గుర్తింపు ఉంది’ అంటూ రీసెంట్ ఇంటర్య్వూలో ఎమోషనల్ అయింది.
Read more:
Next Story






