బిగ్ ట్విస్ట్ ఇచ్చిన మలైకా అరోరా.. 51 ఏళ్ల వయసులో అతడితో పెళ్లిపై హింట్.. వీడియో వైరల్!

by Mallepaka Hamsa |   (  Updated:2025-09-23 06:09:01  IST  )

బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా (Malaika Arora)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

బిగ్ ట్విస్ట్ ఇచ్చిన మలైకా అరోరా.. 51 ఏళ్ల వయసులో అతడితో పెళ్లిపై హింట్.. వీడియో వైరల్!
X

దిశ, సినిమా: బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా (Malaika Arora)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ భామ ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. ఆమె నటించిన సినిమాలకంటే పర్సనల్ లైఫ్ పరంగానే ఎక్కువ గుర్తింపు సంపాదించుకుంది. గత కొన్నేళ్ల నుంచి బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ కపూర్‌(Arjun Kapoor)తో రిలేషన్‌షిప్ కొనసాగించింది. వీరిద్దరి మధ్య దాదాపు 12ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్నప్పటికీ కొద్దికాలం పాటు వెకేషన్స్ అంటూ చెట్టపట్టాలేసుకుని తిరిగి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.

అంతేకాకుండా త్వరలో వీరు పెళ్లి చేసుకుంటారని అంతా భావించారు. ఈక్రమంలోనే వారు బ్రేకప్ చెప్పుకొని విడిపోయారని పలు వార్తలు వచ్చాయి. అలాగే అర్జున్ కపూర్ సైతం ఇండైరెక్ట్‌గా సోషల్ మీడియా ద్వారా ఎమోషనల్ పోస్టులు పెట్టడంతో అంతా విడిపోయారని ఫిక్స్ అయిపోయారు. తనకు బ్రేకప్ చెప్పినప్పటికీ అర్జున్ తన గర్ల్ ఫ్రెండ్ తండ్రి మరణించడంతో ఇంటికి వెళ్లి మరీ నివాళులు అర్పించాడు. ఇక అప్పటి నుంచి మలైకా- అర్జున్ దూరంగా ఉంటున్నారు. సోషల్ మీడియాలోనూ పోస్టులు పెట్టడం లేదు.

ఎవరి లైఫ్‌లో వారు ఫుల్ బిజీగా ఉంటున్నారు. ఇక ఎలాంటి ఈవెంట్‌లోనూ పాల్గొనలేదు. తాజాగా, మలైకా, అర్జున్ చాలా రోజుల తర్వాత ఓ ఈవెంట్‌లో క్లోజ్‌గా కనిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తోంది. వీరిద్దరు గట్టిగా హగ్ చేసుకోవడంతో పాటు ముద్దులు కూడా పెట్టుకున్నారు. ఇక అది చూసిన నెటిజన్లు సూపర్ 51ఏళ్ల వయసులో మలైకా పెళ్లి చేసుకోబోతుందని ఈ విషయంపై ఇలా హింట్ ఇచ్చిందని అంతా గుసగుసలాడుకుంటున్నారు.

Next Story