నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అనేలా ‘మకుటం’ క్లైమాక్స్ షూట్.. హైప్ పెంచుతున్న మేకర్స్

by Mallepaka Hamsa |

వెర్సటైల్ హీరో విశాల్‌(Vishal) స్వీయ దర్శకత్వంలో ‘మకుటం’ (makutam)చిత్రం రాబోతోంది.

నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అనేలా ‘మకుటం’ క్లైమాక్స్ షూట్.. హైప్ పెంచుతున్న మేకర్స్
X

దిశ, సినిమా: వెర్సటైల్ హీరో విశాల్‌(Vishal) స్వీయ దర్శకత్వంలో ‘మకుటం’ (makutam)చిత్రం రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, గ్లింప్స్ సంచలనంగా మారాయి. తాజాగా, ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. వరుసగా 17 రోజుల పాటు నిర్విరామంగా షూటింగ్ చేసినట్టుగా ప్రకటించారు. ఈ మేరకు చిత్రబృందం ఓ ప్రెస్ నోట్‌ని కూడా రిలీజ్ చేశారు. ‘‘విశాల్ స్వీయ దర్శకత్వంలో రానున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘మకుటం’ సినిమాకు సంబంధించిన గ్రాండ్ క్లైమాక్స్ షూటింగ్ పూర్తయింది. ఓ వార్ సీక్వెన్స్‌కు వందల కొద్దీ స్టంట్ ఆర్టిస్టులతో ఈ క్లైమాక్స్‌ను షూట్ చేశాం.

దాదాపు 800 వందల మంది టెక్నీషియన్లతో ఈ షూటింగ్‌ను భారీ ఎత్తున కంప్లీట్ చేశాం. ఎమోషన్స్, విజువల్ గ్రాండియర్, బ్రీత్ టేకింగ్ యాక్షన్‌లతో ఈ క్లైమాక్స్‌ను నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అనేలా చిత్రీకరించాం. విశాల్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ఆయన పర్ఫామెన్స్ అదిరిపోతుంది. ఇక దిలీప్ సుబ్బరాయన్ వంటి స్టంట్ కొరియోగ్రాఫర్‌తో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో ఈ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించాం. ఈ చిత్రం కంప్లీట్ కమర్షియల్ అంశాలతో రానుంది’’ అని రాసుకొచ్చారు.

Next Story