- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ బండారం బయటపెట్టిన మేకప్ ఆర్టిస్ట్.. సంచలనంగా మారిన ఇన్‌స్టా పోస్ట్
గత కొద్ది రోజుల నుంచి తెలుగు ఇండస్ట్రీలో పలు వివాదాలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇటీవల

దిశ, సినిమా: గత కొద్ది రోజుల నుంచి తెలుగు ఇండస్ట్రీలో పలు వివాదాలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇటీవల డింపుల్ హయాతీ ఓ ఇద్దరు అమ్మాయిలతో ఇంట్లో పని చేపించుకొని డబ్బులు ఇవ్వకుండా బెదిరిస్తోందని పలు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తన భర్తతో పాటు డింపుల్ హయాతీ వేధిస్తున్నారంటూ ఇద్దరు అమ్మాయిలు కేసు కూడా పెట్టారు. ఇక ఈ వివాదం ఓ కొలిక్కి రాకముందే.. ఇండస్ట్రీలో మరో సంఘటన సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ వద్ద మేకప్ ఆర్టిస్ట్ పనిచేస్తున్న ఓ మహిళ తనను వేధిస్తున్నారంటూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సెన్సేషనల్ పోస్ట్ పెట్టింది.
హీరోయిన్‌తో పాటు ఆమె తల్లి కూడా ఇబ్బంది పెడుతోందని సంచలన ఆరోపణలు చేసింది. ‘‘గత కొన్నాళ్లుగా ఓ స్టార్ హీరోయిన్ నన్ను వేధిస్తోంది. ఆమెతో పాటు, కుటుంబ సభ్యులు కూడా ఇందులో భాగమయ్యారు. దక్షిణాదిలో వాళ్లకు తక్కువ మొత్తానికి లేదంటే ఫ్రీగా పనిచేసినట్లు ఇక్కడ కూడా పనిచేస్తారని అనుకుంటున్నారు. మాకు చాలా తక్కువ డబ్బులు ఇస్తున్నారు. నాకు నీతో పనిచేయాలని లేదు. కాబట్టి ఇకపై ఫోన్ మెసేజ్ చేయొద్దని చెబుతున్నాను. ఆమె కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు.
మిగతావాళ్లు సారీ చెబుతున్నారు. కానీ నాకు మీతో పని చేయాలని లేదు. మా డబ్బులు నొక్కేయడం ఆపండి. లేదంటే ఈ సారి మీ పేర్లు బయటపెడతాను’’ అని రాసుకొచ్చింది. కానీ ఆ స్టార్ హీరోయిన్ పేరును మాత్రం రివీల్ చేయలేదు. అలాగే తన పేరు కూడా బయటపడకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో దుమార్ రేపుతోంది. అసలు ఆ హీరోయిన్ ఎవరా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగులో స్టార్ హీరోయిన్‌గా పని చేసిన ఆమె ప్రస్తుతం బాలీవుడ్‌లో పలు ప్రాజెక్టులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
READ MORE ....
అతనిపై ఉన్న ప్రేమను బయటపెట్టిన నిహారిక.. వైరల్‌గా మారిన ఇన్‌స్టా పోస్ట్






