- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ది రాజాసాబ్’ వాయిదాపై స్పందించిన మేకర్స్.. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటూ కీలక నోట్ విడుదల
హారర్ కామెడీ నేపథ్యంలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘ది రాజాసాబ్’(The Rajasaab).

దిశ, సినిమా: హారర్ కామెడీ నేపథ్యంలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘ది రాజాసాబ్’(The Rajasaab). పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా మారుతి(Maruti) దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ మూవీ పలు కారణాల వల్ల వాయిదా పడుతూనే ఉంది. ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కావాల్సి ఉండగా.. షూటింగ్ కంప్లీట్ కాకపోవడంతో డిసెంబర్‌కు వాయిదా పడింది. అంతేకాకుండా మరోసారి వాయిదా పడి అందరినీ నిరాశకు గురి చేసింది. వచ్చే ఏడాది జనవరి 9కి వాయిదా వేశారు. ఇక గత కొద్ది కాలంగా జనవరి 9న కూడా విడుదల కావడం లేదని షూటింగ్ వల్ల మరోసారి వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు పలు పుకార్లు షికారు చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో.. తాజాగా, మూవీ మేకర్స్ ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ‘‘ది రాజాసాబ్‌కు సంబంధించిన వీఎఫ్ఎక్స్, పోస్ట్ ప్రొడక్షను పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే గత కొద్ది కాలంగా మా సినిమాపై తప్పుడు వార్తలు సృష్టించి వైరల్ చేస్తున్నారు. మరోసారి వాయిదా పడిందంటూ.. ప్రచారం చేస్తున్నారు. జనవరి 9న అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఐమాక్స్ వెర్షన్‌తో సహా అన్ని ఫార్మెట్లలో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. డిసెంబర్లో అమెరికాలో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపబోతున్నాం. డిసెంబర్ 25లోపు అన్ని పనులు పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీని సిద్ధం చేసే ప్లాన్ చేస్తున్నాం.
ఈ సంక్రాంతికి అన్ని థియేటర్స్‌లో సందడిని రెట్టింపు చేసేందుకు మా రాజాసాబ్ సిద్ధమవుతున్నాడు. విశ్వప్రసాద్ గారు ఎక్కడా రాజీ పడకుండా.. దీనిని నిర్మిస్తున్నారు. మారుతి కూడా ప్రతి విషయంలోనూ రెట్టింపు శ్రద్ధ తీసుకుని షూట్ చేస్తున్నారు’’ అని నోట్ విడుదల చేశారు. కాగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై రాబోతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. సంజయ్ దత్, యోగిబాబు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ప్రభాస్ మొదటిసారి హారర్, కామెడీ జానర్లో నటిస్తుండటంతో.. ‘ది రాజాసాబ్’పై సినీ ప్రేక్షకుల్లో ఎక్స్పెక్టేషన్స్ హైగా ఉన్నాయి.
READ MORE ....
ప్రభాస్, ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్.. హీరోయిన్గా యంగ్ బ్యూటీ!






