‘ది బెంగాల్ ఫైల్స్’ బోల్డెస్ట్ ట్రైలర్ రాబోతుందంటూ మేకర్స్ పోస్ట్.. గూస్ బంప్స్‌ను తెప్పిస్తోన్న పవర్ ఫుల్ పోస్టర్‌

by Mallepaka Hamsa |

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri)దర్శకత్వంలో రాబోతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ది బెంగాల్ ఫైల్స్’(The Bengal Files).

‘ది బెంగాల్ ఫైల్స్’ బోల్డెస్ట్ ట్రైలర్ రాబోతుందంటూ మేకర్స్ పోస్ట్.. గూస్ బంప్స్‌ను తెప్పిస్తోన్న పవర్ ఫుల్ పోస్టర్‌
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి (Vivek Agnihotri)దర్శకత్వంలో రాబోతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ది బెంగాల్ ఫైల్స్’(The Bengal Files). ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ‘ది కాశ్మీర్ ఫైల్స్’కు సీక్వెల్‌గా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం 1940లలో అవిభక్త బెంగాల్‌లో జరిగిన మత హింసను ఆధారంగా చేసుకుని తెరకెక్కనుంది. వాటిలో 1946 డైరెక్ట్ యాక్షన్ డే, 1946 నోఖాలి అల్లర్లు , హిందూ మారణహోమం వంటి సంఘటనలు ఇందులో చూపించబోతున్నారు. ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్(Anupam Kher), గోవింద్ నామ్‌దేవ్, పల్లవి జోషి కీలకపాత్రలో నటిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం సెప్టెంబర్ 5న థియేటర్స్‌లోకి రాబోతుంది.

ఇప్పటికే ఇందులోంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాయి. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ చేసి వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రాబోతున్నట్లు ప్రకటించారు. ‘ది బెంగాల్ ఫైల్స్’ బొల్డెస్ట్ ట్రైలర్ ఆగస్టు 16న మధ్యాహ్నం 12 గంటలకు రాబోతున్నట్లు తెలుపుతూ ఓ పవర్ ఫుల్ పోస్టర్‌ను షేర్ చేశారు. ఇందులో ఓ అమ్మాయి చీర కట్టుకుని జుట్టు చేతిలో ఆయుధాన్ని పట్టుకుని భయంకరంగా కనిపించగా.. ఆమె వెనకాల మంటలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ పోస్టర్ అందరిలో గూస్ బంప్స్‌ను తెప్పిస్తోంది.

link

Next Story