- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘‘అయ్యయ్యో పోయే పప్పీ షేమ్ ఆయే’’.. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్
టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని(Ram Pothineni) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’(Andhra King Taluka).

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని(Ram Pothineni) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’(Andhra King Taluka). ఈ సినిమాకు పి మహేష్ బాబు(P Mahesh Babu) దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో స్టార్ హీరో ఉపేంద్ర, రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, ఫస్ట్ సాంగ్ ‘నువ్వుంటే చాలే’ సూపర్ హిట్‌గా నిలిచాయి. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ నవంబర్ 28న థియేటర్స్‌లో రాబోతుంది. దీంతో అప్పుడే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్రబృందం వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. తాజాగా, ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ చిత్రానికి సంబంధించిన సెకండ్ సింగిల్ అప్డేట్‌ను ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. అభిమానులు.. కాలేజ్.. పిచ్చి సరదాలతో కలిగిన అయ్యయ్యో పోయే పప్పీ షేమ్ ఆయే సాంగ్ సెప్టెంబర్ 8న రాబోతున్నట్లు వెల్లడించారు. అలాగే రామ్ పోతినేని నవ్వుతూ ఒ వ్యక్తిని హేళన చేస్తున్నట్లు ఉన్న పోస్టర్‌ను షేర్ చేసి క్యూరియాసిటీని పెంచారు.






