ప్రభాస్ లుక్ షేర్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ మూవీ మేకర్స్ స్ట్రాంగ్ వార్నింగ్

by Mallepaka Hamsa |

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ఇటీవల ‘కన్నప్ప’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ప్రభాస్ లుక్ షేర్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ మూవీ మేకర్స్ స్ట్రాంగ్ వార్నింగ్
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ఇటీవల ‘కన్నప్ప’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీలో కీలక పాత్రలో నటించారు. కానీ హిట్ అందుకోలేకపోయారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ‘కన్నప్ప’ బాక్సాఫీసు వద్ద మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం డార్లింగ్ వరుస ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఆయన నటిస్తున్న సినిమాలో ఒకటి హను రాఘవపూడి(Hanu Raghavapudi)తో చేస్తున్న విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ చిత్రంలో కొత్త బ్యూటీ ఇమాన్వి ఇస్మాయిల్(Imanvi Ismail), ప్రభాస్ సరసన రొమాన్స్ చేయనుంది. ‘ఫౌజీ’ టైటిల్‌తో తెరకెక్కుతున్నట్లు టాక్. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో సైనికుడిగా ప్రభాస్ కనిపించనుండగా.. వాస్తవ సంఘటనతో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. షూటింగ్శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాకు లీకుల బెడద తప్పలేదు. హీరోకు సంబంధించిన పలు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో.. తాజాగా, మూవీ మేకర్స్ ట్విట్టర్ ద్వారా మాస్ వార్నింగ్ ఇచ్చారు. ‘‘ప్రభాస్-హనురాఘవపూడి సినిమా కోసం ఎంతోమంది ఎదురుచూస్తున్నారని మాకు తెలుసు. చిత్రీకరణ సమయంలో సెట్స్ నుంచి ఓ ఫొటో బయటకు వచ్చినట్లు మా దృష్టికి వచ్చింది. మీకు అద్భుతమైన సినిమాటిక్ అనుబవాన్ని ఇవ్వడానికే ఎంతోమంది నిరంతరం కష్టపడుతున్నారు. కాబట్టి ఇలాంటి సమయంలో లీకులు మా టీమ్ నైతికతను దెబ్బతీస్తాయి. అనధికారికంగా ఎవరైనా ఈ సినిమాకు సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తే వారి ఖాతాలను తొలగించడంతో పాటు.. సైబర్ నేరంగా పరిగణిస్తాం. అంతేకాకుండా వారిపై కఠిర చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడబోము’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతుండటంతో నెటిజన్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

link

Next Story