- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘మోగ్లీ’ టీజర్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. క్యూరియాసిటీ పెంచుతున్న పోస్టర్
ఎంతోమంది స్టార్ కిడ్స్ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. మరికొందరు తమ టాలెంట్‌తో స్టార్స్‌గానూ ఎదిగారు.

దిశ, సినిమా: ఎంతోమంది స్టార్ కిడ్స్ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. మరికొందరు తమ టాలెంట్‌తో స్టార్స్‌గానూ ఎదిగారు. ఇక ఇటీవల యాంకర్ సుమ తనయుడు రోషన్ కనకాల (Roshan Kanakala)హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. మొదటి ప్రాజెక్ట్ పెద్దగా మెప్పించలేదు. ప్రస్తుతం ‘మోగ్లీ’(Mowgli) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తన రెండో ప్రాజెక్ట్‌గా రాబోతున్న ఈ చిత్రానికి నేషనల్ అవార్డు విన్నర్ సందీప్ రాజ్(Sandeep Raj) తెరకెక్కిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తుండగా.. ఇందులో సాక్షి సాగర్ మదోల్కర్ హీరోయిన్‌గా నటిస్తోంది. వైవా హర్ష కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీకి కాల భైరవ సంగీతం అందిస్తున్నారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఈనేపథ్యంలో.. ప్రమోషనల్ కంటెంట్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్న మూవీ మేకర్స్ టీజర్ రాబోతున్నట్లు ప్రకటించారు. ‘మోగ్లీ’ సినిమాకు సంబంధించిన టీజర్ నవంబర్ 12న రాబోతుందని వెల్లడిస్తూ.. రోషన్ కనకాల ఇంటెన్స్ లుక్‌లో ఉన్న ఆసక్తికర పోస్టర్‌ను షేర్ చేశారు. ఇందులో ఆయన హనుమాన్ గద లాకెట్‌ను చూపిస్తూ క్యూరియాసిటీ పెంచుతున్నారు. ‘‘చూచి రమ్మనా.. కాల్చి వచ్చినా.. ‘మోగ్లీ’టీజర్‌తో భావోద్వేగాలతో పాటు ఓ ఉప్పెనను అనుభవించడానికి సిద్ధంగా ఉండండి’’ అనే క్యాప్షన్ జత చేశారు.






