పూరీ-విజయ్ సేతుపతి సినిమాపై బిగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. పోస్ట్ వైరల్

by Mallepaka Hamsa |

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి(Vijay Sethupathi), పూరీ జగన్నాథ్ (Puri Jagannath)కాంబినేషన్లో రాబోతున్న ప్రాజెక్ట్‌కు సంబంధించిన బిగ్ అప్డేట్‌ను మేకర్స్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.

పూరీ-విజయ్ సేతుపతి సినిమాపై బిగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి(Vijay Sethupathi), పూరీ జగన్నాథ్ (Puri Jagannath)కాంబినేషన్లో రాబోతున్న ప్రాజెక్ట్‌కు సంబంధించిన బిగ్ అప్డేట్‌ను మేకర్స్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తి చేసినట్లు తెలుపుతూ ఓ ఫన్నీ వీడియోను షేర్ చేసి సినీ ప్రియుల్లో జోష్ పెంచారు. ‘‘ఎన్నో నెలల ప్రయాణం. ఎన్నో భావోద్వేగమైన క్షణాలు. మరెన్నో ఆనందకరమైన అనుభవాలతో ఈ సినిమా షూటింగ్ పూర్తి అయింది. త్వరలోనే వరుస అప్‌డేట్స్ రాబోతున్నాయి. అందరూ వేచి ఉండండి’’ అని రాసుకొచ్చారు.

అయితే జూలై మొదటి వారంలో మొదలైన ఈ షూటింగ్ కేవలం ఐదు నెలల్లోనే కంప్లీట్ చేసేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కాగా.. ఈ సినిమాలో సంయుక్త మీనన్ (Samyuktha Menon)హీరోయిన్‌గా నటిస్తుండగా.. టబు, విజయ్ కుమార్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ నిర్మిస్తున్నారు. ఇందులో విజయ్ సేతుపతి మునుపెన్నడూ చేయని విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో భారీ హైప్ నెలకొంది. ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తాయా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

link

Next Story