భారీ పాన్-ఇండియా ఎంటర్‌టైనర్‌ ‘కట్టలన్’పై బిగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్

by Mallepaka Hamsa |

క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పాన్ ఇండియా మూవీని ప్రకటించింది. షరీఫ్ మహమ్మద్ మరో భారీ ప్రాజెక్ట్ ‘కట్టలన్’ను లాంచ్ చేశారు.

భారీ పాన్-ఇండియా ఎంటర్‌టైనర్‌ ‘కట్టలన్’పై బిగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్
X

దిశ, సినిమా: క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పాన్ ఇండియా మూవీని ప్రకటించింది. షరీఫ్ మహమ్మద్ మరో భారీ ప్రాజెక్ట్ ‘కట్టలన్’ను లాంచ్ చేశారు. మలయాళం, తెలుగు భాషల్లో పాన్ ఇండియా ఎంటర్‌టైనర్‌ గా రూపొందనున్న ఈ మూవీ పూజా కార్యక్రమం కొచ్చిలో అద్భుతంగా జరిగింది. బాహుబలిలో కనిపించి ఫేమస్ అయిన చిరక్కల్ కలీదాసన్ ఏనుగు పూజా కార్యక్రమంలో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈవెంట్‌లో యాంటోని వర్గీస్, కబీర్ దూహన్ సింగ్, రాజిషా విజయన్(Rajisha Vijayan), హనన్ షా, జగదీష్, సిద్దిక్, పార్త్ తివారీ (Parth Tiwari)లాంటి స్టార్‌లు హాజరయ్యారు.

సుమారు ₹45 కోట్లు బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ పాన్-ఇండియన్ యాక్షన్ థ్రిల్లర్‌కు డెబ్యూ డైరెక్టర్ పాల్ జార్జ్ దర్శకత్వం వహిస్తుండగా, కాంతార, మహారాజా సినిమాలతో సౌత్‌లో సంచలనం సృష్టించిన కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ‘మార్కో’ కోసం కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్‌ని తీసుకొచ్చిన క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఇప్పుడు మరో బిగ్ కంపోజర్‌ని పరిచయం చేస్తోంది. ఇందులో హీరోయిన్‌గా రాజిషా విజయన్ నటిస్తుండగా.., కబీర్ దూహన్ సింగ్, వ్లాగర్-సింగర్ హనన్ షా, ర్యాపర్ బేబీ జీన్, తెలుగు నటుడు రాజ్ తిరందాసు, అలాగే సీనియర్ నటులు జగదీష్, సిద్దిక్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా త్వరలో ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.

Next Story