- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చిన మేకర్స్.. ‘కరుప్పు’లో త్రిష విశ్వరూపం.. షాకింగ్ వీడియో వైరల్
సూర్య - త్రిషల కాంబినేషన్ చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ వెండితెరపై మ్యాజిక్ చేయబోతోంది.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, విలక్షణ దర్శకుడు ఆర్జే బాలాజీ కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘కరుప్పు’. భారీ బడ్జెట్‌తో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.. తాజాగా ఈ సినిమా నుంచి ఒక అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చి చిత్రబృందం ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేసింది. ముఖ్యంగా ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్న సౌత్ క్వీన్ త్రిష పాత్రకు సంబంధించిన గ్లింప్స్ వీడియోను విడుదల చేసి మూవీపై క్యూరియాసిటీని రెట్టింపు చేశారు మేకర్స్. ఈ సినిమాలో త్రిష ‘ప్రీతి’ అనే పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తోంది. తాజాగా విడుదలైన వీడియోలో ఆమె ముందుగా లాయర్‌గా కనిపించి మెప్పించింది. కోర్టు హాల్‌లో సీరియస్ లుక్‌లో కనిపిస్తూనే, ఆ తర్వాత సడెన్ గా చీర కట్టుకుని మాస్ యాంగిల్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. త్రిష ఈ సినిమాలో కేవలం గ్లామర్ పాత్రకే పరిమితం కాకుండా, కథను మలుపు తిప్పే కీలక పాత్రలో కనిపిస్తోందని ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది.
సూర్య - త్రిషల కాంబినేషన్ చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ వెండితెరపై మ్యాజిక్ చేయబోతోంది. తమిళంలో ‘కరుప్పు’ అనే పేరుతో వస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో ‘వీరభద్రుడు’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులలో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. మే 14న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. వేసవి సెలవుల్లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఆర్జే బాలాజీ తనదైన మార్కు ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఒక సీరియస్ మెసేజ్ ఉన్న కథను ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా థియేటర్స్‌ను బ్లాస్ట్ చేస్తుందని మేకర్స్ ఎంతో ధీమా వ్యక్తం చేస్తున్నారు. సూర్య మార్క్ యాక్షన్, త్రిష అభినయం తోడైతే బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయం!






