అంబానీ ఇంటి ఆడపడుచుల మేకప్ ఆర్టిస్ట్ ఒక్కొక్కరికి ఎంత తీసుకుంటారంటే..

by Dishafeatures1 |
అంబానీ ఇంటి ఆడపడుచుల మేకప్ ఆర్టిస్ట్ ఒక్కొక్కరికి ఎంత తీసుకుంటారంటే..
X

దిశ, సినిమా: ఏ సందర్భానికి హాజరైన అంబానీల ఇంటి కోడళ్ళు, కూతుర్లు తమ అందంతో కెమెరాలను కట్టి పడేస్తారు. నీతా అంబానీ, ఇషా అంబానీ, శ్లోకా మెహతా ఇప్పుడు రాధిక మర్చంట్. వీరందరూ తల తిప్పలేనంత అందంగా ముస్తాబై కనిపిస్తారు. అయితే వీరికి ఎన్నో ఏళ్లుగా మేకప్ చేస్తున్నది ఒకే వ్యక్తి ..మిక్కి కాంట్రాక్టర్. అంబానీలకు ఏ కార్యక్రమమైనా మేకప్ చేసేది ఆయనే.

మన దేశంలో హై ప్రొఫైల్ మేకప్ ఆర్టిస్టుల్లో ఒకరైనా మిక్కీ.. దాదాపు ముప్పై ఏళ్లకు పైగా ఇదే రంగంలో ఉన్నారు. దీపికా పదుకొనే, కరీనా కపూర్, ఐశ్వర్యరాయ్, కాజోల్, అనుష్క శర్మ, అనన్య పాండే, జాన్వీ కపూర్ వంటి నేటి యువ తారలకు పర్సనల్ మేకప్ ఆర్టిస్టు‌గా ఉండి. అలా బాలీవుడ్ ప్రముఖులతో పాటు, అంబానీ ఫ్యామిలితో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు.

మరి ఆయన ఒక్కొక్కరికి ఎంత ఛార్జ్ చేస్తారు? అనే విషయం గురించి మాట్లాడుకుంటే. మనదేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న మేకప్ ఆర్టిస్టుల్లో మిక్కీ కాంట్రాక్టర్ ఒకరంటా. కాగా ఆయన ఒకసారి మేకప్ చేసినందుకు లక్ష రూపాయల వరకు వసూలు చేస్తారు. ప్రజంట్ మిక్కీ కి సంబంధించిన ఈ న్యూస్ వైరల్ అవుతుంది.

Read More..

ఇది ఎప్పటికీ మరువలేమంటూ అంబానీ వేడుక గురించి.. ఉపాసన ఆసక్తికర పోస్ట్



Next Story

Most Viewed