మహేష్ విట్ట ‘ఉత్తుత్త హీరోలు’ సక్సెస్ అవ్వాలి : సుహాస్

by Mallepaka Hamsa |

ఈ రాయలసీమ నేపథ్యంలో సాగే ఈచిత్రంలో నాలుగు ప్రధాన పాత్రలు ఉంటాయి.

మహేష్ విట్ట ‘ఉత్తుత్త హీరోలు’ సక్సెస్ అవ్వాలి : సుహాస్
X

దిశ, సినిమా: ‘ఉత్తుత్త హీరోలు’ సినిమాను ఎంవిఎం పిక్చర్స్ బ్యానర్ పై మహేష్ విట్టా(Mahesh Witta) నిర్మించారు . హాస్య నటనకు పేరుగాంచిన మహేష్ విట్టా తొలిసారిగా నిర్మాణంలోకి అడుగుపెట్టారు, రాయలసీమ నేపథ్యంలో సాగే కథనాన్ని ఎంచుకున్నారు. ఈ చిత్రానికి హర్ష కొడాలి దర్శకుడు. ఫిబ్రవరి 27న థియేటర్స్ లో విడుదల కాబోతున్న ‘’ఉత్తుత్త హీరోలు‘’ సినిమా సక్సెస్ అయ్యి మహేష్ విట్ట కు అలాగే చిత్ర యూనిట్ సభ్యులకు మంచి పేరు రావాలని హీరో సుహాస్ తెలిపారు. మహేష్ విట్ట ఈ ప్రాజెక్ట్ లో నిర్మాత, హీరోగా రాబోతున్నాడు. ఈ రాయలసీమ నేపథ్యంలో సాగే ఈచిత్రంలో నాలుగు ప్రధాన పాత్రలు ఉంటాయి. ‘ఉత్తుత్త హీరోలు’ రాయలసీమ ప్రాంతం నేపథ్యంలో హాస్యం, ఉత్కంఠభరితమైన అంశాలను మిళితం చేస్తూ ఆకర్షణీయమైన కథనాన్ని అందిస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

అలాగే రాయలసీమ నుండి వచ్చిన మొదటి కల్ట్ ఫిల్మ్ చిత్ర షూటింగ్ మొత్తం కడప జిల్లాలో చేసినట్లు, కడప జిల్లా నుండి ఎంచుకున్న 75 మంది నూతన నటీనటులను పరిచయం చేస్తున్నట్లు మహేష్ విట్ట తెలిపారు. ప్రామాణికమైన రాయలసీమ భాష మరియు యాసలతో, ఈ చిత్రం ప్రేక్షకులను ఆకర్షించడానికి ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మహేష్ విట్టాతోపాటు ప్రవీణా సోని, తారక్ సతీష్, వాల్తేర్ వినయ్, రాహుల్ రాజ్ వనం, హర శ్రీనివాస్, భరత్ బెహరా తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Next Story