- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహేష్ నటించిన ఆ సినిమా నాకు నచ్చలేదు: నమ్రత
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలపై ఆయన భార్య, నటి నమ్రత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

X
దిశ, సినిమా : సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలపై ఆయన భార్య, నటి నమ్రత ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అంతేకాదు తన రీ ఎంట్రీపై గురించి కూడా ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఇటీవల ఓ సమావేశంలో పాల్గొన్న నమ్రతను మళ్లీ సినిమాల్లో నటిస్తారా? మహేష్ సినిమాలో చిన్న పాత్ర చేయాలనే ఆలోచన ఉందా? అవకాశం ఉంటే చేస్తారా? అని అడిగారు. దీంతో ఏ మాత్రం ఆలోచించకుండా ‘చేయను’ అని చెప్పేసింది. అలాగే మహేష్ సినిమాలో మీకు నచ్చని మూవీ ఏది అంటే.. ‘‘సైనికుడు’ నాకు అస్సలు నచ్చలేదు. స్టూడెంట్స్ రాజకీయాల్లోకి రావాలి అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. నాకు ఆ కాన్సెప్ట్ సరిగా అర్థంకాలేదు’ అని వివరించింది.
ఇవి కూడా చదవండి: వీక్ మూమెంట్‌లో కమిట్ అయ్యా.. నటి స్టేట్‌మెంట్
Next Story






