Romantic Photo : మహేష్, నమ్రత వివాహ బంధానికి 18 ఏళ్లు.. రొమాంటిక్ పిక్ వైరల్

by Disha Web Desk 10 |
Romantic Photo : మహేష్, నమ్రత వివాహ బంధానికి 18 ఏళ్లు.. రొమాంటిక్ పిక్ వైరల్
X

దిశ, సినిమా: టాలీవుడ్‌లో మోస్ట్ రొమాంటిక్ కపుల్ అనగానే మనకు ఠక్కున గుర్తుకు వచ్చే జంట సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత. తాజాగా వీరి వైవాహిక బంధానికి 18 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా వీరు విహారానికి వెళ్లారు. నిజం చెప్పాలంటే ఫ్యామిలీకి మోస్ట్ ప్రయారిటీ ఇచ్చే ప్రిన్స్ మహేష్ ఏ మాత్రం ఖాళీ దొరికినా ఎంచక్కా వెకేషన్ ప్లాన్ చేసుకుంటూ కుటుంబంతో ఎంజాయ్ చేస్తుంటాడు. తన పెళ్లి రోజును కూడా గ్రాండ్‌గా ప్లాన్ చెసుకున్న మహేష్ బాబు స్విట్జర్లాండ్‌కు వెళ్లినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి మహేష్, నమ్రత ఇద్దరూ అక్కడి ఫొటోలను తమ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. మహేష్ నార్మల్ ఫొటోను షేర్ చేయగా.. నమ్రత మాత్రం మోస్ట్ రొమాంటిక్ పిక్‌ను పోస్టు చేసింది. ''కొంచెం క్రేజీగా ఉన్న ఈ ప్రేమకు 18 ఏళ్లు పూర్తయింది. ఎప్పటికీ ఇలాగే కొనసాగాలి నమ్రత' అంటూ తన భార్యకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపాడు మహేష్. దీనికి నమ్రత కూడా 'ఐ లవ్ యూ టూ' అంటూ లవ్ ఎమోజీల‌తో రిప్లై ఇచ్చింది.


Next Story