- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ సినిమా పేరు చెప్పగానే మహేష్ భయపడ్డాడు.. సుధీర్ బాబు కామెంట్స్ వైరల్
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు, హర్షవర్ధన్ కాంబోలో వస్తున్న మూవీ ‘మామా మశ్చీంద్ర’.

దిశ, సినిమా : టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు, హర్షవర్ధన్ కాంబోలో వస్తున్న మూవీ ‘మామా మశ్చీంద్ర’. అయితే ఈ మూవీ అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు మేకర్స్. ఈ సందర్భంగా చిత్ర విశేషాలు పంచుకున్న సుధీర్ బాబు.. ఈ స్టోరీ చెప్పగానే మహేష్ బాబు షాక్ అయ్యాడని తెలిపాడు. ‘ఓసారి బావ మహేష్ కలిసి నెక్ట్స్ ఏ సినిమా చేస్తున్నావని అడిగాడు. నేను ‘మామా మశ్చీంద్ర’ పేరు చెప్పి.. మూడు క్యారెక్టర్లు పోషిస్తున్నానన్నాను. అందులో ఒక పాత్రకోసం లావెక్కేందుకు బాగా తింటున్నానని వివరించా. దీంతో ఆయన కంగారు పడ్డాడు. ఇంత సాహసం చేస్తున్నందుకు నాకైతే భయంగానే ఉందన్నాడు. కానీ తర్వాత కొన్ని సలహాలు ఇచ్చాడు. గతంలో ఇలాంటి క్యారెక్టర్లను ఉద్దేశించి చాలా టిప్స్ చెప్పాడు. ఆయన ప్రోత్సాహం నాకు ఎంతో పాజిటీవ్ ఎనర్జీని ఇచ్చింది’ అంటూ మహేష్‌తో పాటు తనకు సినీ జీవితాన్ని ఇచ్చిన మామయ్య, దివంగత నటుడు కృష్ణకు కృతజ్ఞతలు తెలిపాడు సుధీర్.






