Janhvi Swaroop: హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్న మహేష్ బాబు మేన కోడలు.. ఫుల్ ఖుషీలో సూపర్ స్టార్ ఫ్యాన్స్!

by Mallepaka Hamsa |

గత కొద్ది రోజులుగా స్టార్ కిడ్స్ ఇండస్ట్రీలోకి హీరో, హీరోయిన్లుగా పరిచయం అవుతూ.. తమ సత్తా చాటుతున్నారు.

Janhvi Swaroop: హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్న మహేష్ బాబు మేన కోడలు.. ఫుల్ ఖుషీలో సూపర్ స్టార్ ఫ్యాన్స్!
X

దిశ, సినిమా: గత కొద్ది రోజులుగా స్టార్ కిడ్స్ ఇండస్ట్రీలోకి హీరో, హీరోయిన్లుగా పరిచయం అవుతూ.. తమ సత్తా చాటుతున్నారు. కొందరు హిట్స్ సాధిస్తూ.. సక్సెస్‌ఫుల్‌గా పరిశ్రమలో రాణిస్తుంటే.. మరికొందరు మాత్రం మధ్యలోనే డ్రాప్ అయిపోతున్నారు. సినిమాలు వదిలేసి మరేదైనా బిజినెస్‌లు చూసుకుంటున్నారు. ఇక సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి ఇప్పటికే చాలామంది హీరో హీరోయిన్లు వచ్చారు. ఆయన వారసుడిగా మహేష్ బాబు(Mahesh Babu) సినీ ఇండస్ట్రీకి వచ్చి పెద్ద స్టార్‌గా ఎదిగారు. ప్రస్తుతం ఆయన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘SSMB-29’ సినిమాలో పనుల్లో ఫుల్ బిజీ అయిపోయారు. రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీ ప్రేక్షకుల్లో అంచనాలు మామూలుగా లేవు.

ఇక మహేష్ బాబు కొడుకు గౌతమ్ కూడా చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించాడు. హీరోగా ఎప్పుడెప్పుడు వస్తాడా? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సూపర్ కూతురు సితార ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వనప్పటికీ.. పలు యాడ్స్‌తో ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. త్వరలోనే సూపర్ స్టార్ కృష్ణ కూతురు కొడుకు కూడా ఇండస్ట్రీకి రాబోతున్నాడు. తాజాగా, కృష్ణ కుటుంబం నుంచి ఓ హీరోయిన్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నట్లు సమాచారం. మంజుల కూతురు, మహేష్ బాబు మేనకోడలు జాన్వీ స్వరూప్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఈమేరకు అధికారిక ప్రకటన కూడా రావడంతో సూపర్ స్టార్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన జాన్వీ మంచి గుర్తింపు తెచ్చుకోగా.. నటించేందుకు ఆసక్తిగా ఉందట. నటనతో పాటు పెయింటింగ్, డ్యాన్స్, డ్రైవింగ్ ఇలా అనేక అంశాల్లో ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తన తల్లి మంజుల దశాబ్దాల క్రితమే హీరోయిన్‌గా నటించాల్సి ఉండగా.. అభిమానులు వద్దనడంతో డ్రాప్ అయింది. ఇక ఇప్పుడు తన కూతురు జాన్విని హీరోయిన్‌గా పరిచయం చేస్తుండటం విశేషం. తనను వద్ద వారికి తన కూతురు నటనతో సమాధానం చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. చూడాలి.. జాన్వీ మొదటి సినిమా ఏ హీరోతో చేస్తుందో? అసలు ఇండస్ట్రీలో ఎలాంటి స్థాయికి చేరుకుంటుందో.

Next Story