- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mahesh Babu : స్టార్ అంటూ కూతురికి బర్త్ డే విష్ చేసిన మహేష్ బాబు.. హీరోయిన్‌గా ఎంట్రీపై హింట్.. ఫొటో కూడా షేరింగ్..
సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ విష్ చేశాడు. ' హ్యాపీ 12 మై లిటిల్ వన్. నీ లైఫ్ లో ఇది బెస్ట్ డే అవ్వాలి. నువ్వు కోరుకున్న ప్రతీది సొంతం కావాలి.

దిశ, సినిమా : సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ విష్ చేశాడు. ' హ్యాపీ 12 మై లిటిల్ వన్. నీ లైఫ్ లో ఇది బెస్ట్ డే అవ్వాలి. నువ్వు కోరుకున్న ప్రతీది సొంతం కావాలి. స్టార్ మాదిరిగా మరింత బ్రైట్ గా వెలిగిపోవాలి. లవ్ యూ. హ్యాపీ బర్త్ డే సన్ షైన్ ' అంటూ శుభాకాంక్షలు తెలిపాడు. సితార ముఖంపై సూర్యకిరణాలు పడుతుండగా తీసుకున్న అందమైన సెల్ఫీని షేర్ చేశాడు. కాగా దీనిపై స్పందించిన మహేష్ భార్య నమ్రత...' హ్యాపీ హ్యాపీ బర్త్ డే లిటిల్ లవ్ ' అంటూ కామెంట్ చేసింది.
ఇక ఈ పోస్ట్ పై రియాక్టు అవుతున్న అభిమానులు.. ఘట్టమనేని లిటిల్ ప్రిన్సెస్ ను ఆశీర్వదిస్తున్నారు. ఫ్యూచర్ సూపర్ స్టార్ అంటూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఇండస్ట్రీలోకి దింపేయ్ అన్నా అంటూ మహేష్ బాబుకు రిక్వెస్ట్ చేస్తున్నారు. మొత్తానికి స్టార్ అని హింట్ ఇచ్చేసాడని.. హీరోయిన్ గా ఎంట్రీ కన్ఫర్మ్ అని మురిసిపోతున్నారు. కాగా అంబానీ పెళ్లిలో తండ్రితోపాటు సితార కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. సెలబ్రిటీలతో పిక్స్ పోస్ట్ చేయగా.. వైరల్ అయింది.






