మొట్టమొదటి సారిగా సితారతో కలిసి టీవీ షోలో కనిపించనున్న Mahesh Babu

by Disha Web Desk 17 |
మొట్టమొదటి సారిగా సితారతో కలిసి టీవీ షోలో కనిపించనున్న Mahesh Babu
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నో అద్భుతమైన రియాలిటీ షోస్ తో ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న జీ తెలుగు, ఇటీవలే డాన్స్ ఇండియా డాన్స్ – తెలుగు మొదటి సీజన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. రెండు బ్లాక్ బస్టర్ లాంచ్ ఎపిసోడ్స్ ద్వారా 10 కంటెస్టెంట్ జోడీలను వీక్షకులకు పరిచయం చేసిన ఛానల్, ఇప్పుడు కాంపిటీషన్ ఫేస్ ను మునుపెన్నడూ లేని విధంగా ప్రారంభించనుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు కాంపిటీషన్ ఫేస్ ను 'ఫ్లాగ్ ఆఫ్' చేయబోతుండగా, తన కూతురు సితార తో కలిసి మొదటిసారి ఒక రియాలిటీ షో లో కనిపించనున్నారు.

కంటెస్టెంట్స్ మైమరపించే ప్రదర్శనలతో పాటు మహేష్-సితారలు యాంకర్స్, జడ్జెస్ తో చేసే సందడి చూడాలంటే, సెప్టెంబర్ 4న (ఆదివారం) రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే డాన్స్ ఇండియా డాన్స్ ఎపిసోడ్ ని చూడాల్సిందే.

మహేష్ బాబు తనదైన కామెడీ టైమింగ్ తో అలరించ బోతుండగా, సితార వాళ్ళ నాన్నతో చేసే అల్లరి ఎపిసోడ్ కే హైలైట్ గా నిలవనుంది. అంతేకాకుండా, తన ముద్దు ముద్దు మాటలతో, చక్కని డాన్స్ ప్రదర్శనతో సితార ఈ వారం 'జీ తెలుగు' ప్రేక్షకులను కనువిందు చేయనుంది.

కాంపిటీషన్ ఫేస్ ను ప్రారంభించిన అనంతరం మహేష్ బాబు మాట్లాడుతూ, "సీతారకు డాన్స్ మీద ఉన్న మక్కువ నన్ను ఈ షో కి వచ్చేలా చేసింది. అంతేకాకుండా, మొదటిసారి నా కూతురితో కలిసి ఒక టీవీ షో లో కనిపించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇది ఎప్పటికీ మరచిపోలేని ఒక స్పెషల్ మూమెంట్. ఎన్నో భాషల్లో సూపర్ హిట్ గా నిలిచిన డాన్స్ ఇండియా డాన్స్ ఇప్పుడు తెలుగులో రావడం, 'జీ తెలుగు' మారుమూల గ్రామాల నుండి టాలెంట్ ని వెలుగులోకి తేవడం అభినందనీయం. ఈ షో లో పాల్గొంటున్న ప్రతిభావంతులైన పోటీదారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తమ కళలను నెరవేర్చుకునే దిశగా అడుగులు వేస్తారని ఆశిస్తున్నాను. అదే విధంగా, ఈ షో కి తమను ఆహ్వానించిన 'జీ తెలుగు' కి ప్రత్యేక ధన్యవాదాలు," అని చెప్పారు.

సితార షో లో తన అనుభవాన్ని ప్రేక్షకులతో పంచుకుంటూ.."నేను ఒక టీవీ షో స్టేజ్ పై రావడం ఇదే మొదటిసారి అయినప్పటికీ నాన్న నా పక్కన ఉండటం వల్ల ఎంతో సాఫీగా గడిచిపోయింది. నాకు డాన్స్ అంటే ఎంతో ఇష్టం, కంటెస్టెంట్స్ పెరఫార్మన్సెస్ నాకు ఎంతో స్ఫూర్తిని కల్పించాయి. నా మొదటి టీవీ షో ఎక్స్పీరియన్స్ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. నన్ను డాన్స్ ఇండియా డాన్స్ కి తీసుకువచ్చిన నాన్నకి స్పెషల్ థాంక్స్," అని చెప్పుకొచ్చింది.

'జీ తెలుగు' చీఫ్ కంటెంట్ ఆఫీసర్ అనురాధ గూడూరు షో కి విచ్చేసినందుకు మహేష్ బాబు కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ..."ఈ కాంపిటీషన్ ను మహేష్ బాబు తన కూతురితో కలిసి లాంచ్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాము. ఇది తప్పకుండా ఇటీవలి కాలంలో వచ్చిన అతి పెద్ద షో లాంచ్‌లలో ఒకటిగా నిలిచిపోతుంది. డాన్స్ ఇండియా డాన్స్ – తెలుగు ద్వారా 'జీ తెలుగు' అద్భుతమైన టాలెంట్ ను వెలికి తీసింది. ఇక నుండి ప్రతి వారం అద్భుతమైన ప్రదర్శనలతో ఈ షో అందరిని అలరిస్తుందని ఆశిస్తున్నాము. మహేష్ బాబు తన కూతురు సితార తో కలిసి చేసిన మొట్టమొదటి టీవీ షో ఎంట్రీ ఈ కార్యక్రమానికి ఎంతో మేలు చేయడంతో పాటు వారి అభిమానులకు కన్నుల పండుగగా నిలవనుంది," అని చెప్పారు.

Also Read : దీపావళికి 'ధమ్కీ' ఇస్తానంటోన్న విశ్వక్ సేన్..


Next Story