- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ హీరోయిన్‌ను పెళ్లి చేసుకున్న మహేష్ బాబు.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
మనసిచ్చి చూడు, శుభస్య శ్రీఘ్రుం, వంటి సీరియల్స్‌లో నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకున్న మహేష్ బాబు (Mahesh Babu)అందరికీ సుపరిచితమే.

దిశ, సినిమా: మనసిచ్చి చూడు, శుభస్య శ్రీఘ్రుం, వంటి సీరియల్స్‌లో నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకున్న మహేష్ బాబు (Mahesh Babu)అందరికీ సుపరిచితమే. ఆయన పలు టీవీ షోస్‌ల్లోనూ కనిపించి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు. ఇక మహేష్ బుల్లితెరపై పలు సీరియల్స్ చేస్తున్న సమయంలోనే సీరియల్ బ్యూటీ సాండ్రా జైచంద్రన్(Sandra Jaichandran)తో పరిచయం ఏర్పడింది. వీరిద్దరు మొదట స్నేహంగా ఉన్నప్పటికీ ఆ తర్వాత ప్రేమగా మారడంతో గత కొద్ది కాలంగా కలిసే ఉంటున్నారు. కాగా..కలవారి కోడలు, ముద్దమందారం, శుభస్య శ్రీఘ్రం వంటి సీరియల్స్ చేసిన సాండ్రా కూడా తెలుగులో పాపులారిటీని దక్కించుకుంది.
ప్రస్తుతం ఆమె ఆటో విజయశాంతి సీరియల్‌లో హీరోయిన్‌కు అక్క పాత్రలో కనిపిస్తోంది. ఇక 19 ఏళ్ల వయసులోనే పెళ్లైన సాండ్రా.. తన భర్త మరో అమ్మాయితో రిలేషన్‌లో ఉన్నాడని విడాకులు ఇచ్చేసింది. తర్వాత చేసుకుంటూ.. మహేష్‌తో ప్రేమలో పడింది. వీరిద్దరు పెద్దలను ఒప్పించుకుని ఇటీవల ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నారు. కానీ పెళ్లి తేదీ వెల్లడించలేదు. సడెన్‌గా అక్టోబర్ 31న సాండ్రా, మహేష్ బాబు పెళ్లితో ఒక్కటయ్యారు. ఈ లవ్ బర్డ్స్.. కుటుంబం, స్నేహితులు, బుల్లితెర సెలబ్రిటీల సమక్షంలో ఏడడుగులు వేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్త వైరల్ కాగా.. వాటిని చూసిన కొందరు షాక్ అవుతున్నారు. మరికొందరు మాత్రం కంగ్రాట్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక సాండ్రా, మహేష్ పెళ్లితో సీరియల్స్‌కు దూరం అవుతారా? లేక మునపటిలా నటిస్తారా? అనేది తెలియాల్సి ఉంది.






