రీమేక్ సినిమా చేయని ఏకైక టాలీవుడ్‌ హీరో అతనే!

by Disha Web Desk 7 |
రీమేక్ సినిమా చేయని ఏకైక టాలీవుడ్‌ హీరో అతనే!
X

దిశ, సినిమా: టాలీవుడ్ సూపర్ స్టార్ క్రిష్ణ వారసుడిగా అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు.. ఇప్పుడు స్టార్ హీరోగా తెలుగు ఇండస్ట్రీని ఏలుతున్నాడు. అయితే తాజాగా మహేష్‌కు సంబంధించి ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఏమీటంటే ఇప్పటివరకు స్టార్ హీరోలంతా దాదాపు ఒక రీమేక్ సినిమా అయిన తీసి హిట్ అందుకున్నారు. కానీ, మహేష్‌కు రిమేక్ అంటే నచ్చదట. తాజాగా ఇంటర్వ్యూలో దీనిపై మాట్లాడుతూ.. ‘ రీమేక్ సినిమాను ప్రేక్షకులంతా ముందుగానే చూసేసి ఉంటారు. మళ్లీ అదే సినిమాను రీమేక్ చేసి చూపించడంలో పెద్ద విషయం ఏమీ ఉంటుంది. ముఖ్యంగా ఒక రీమేక్ మూవీ‌లో నటించాలంటే ఆ మూవీలో ఉన్న హీరోలాగా నేను యాక్ట్ చేయాలా.. లేకపోతే నా స్టైల్‌లో చేయాలా అనేది అర్థం కాదు. అందుకే నాకు రీమేక్ సినిమాలు పెద్దగా నచ్చవు. ప్రేక్షకులకు కొత్తదనాన్ని చూపించాలనేది నా ఆలోచన’ అని మహేష్ చెప్పుకొచ్చాడు.

Read More: ఆ యాడ్‌లో నటించినందుకు రాజమౌళి ఎంత తీసుకున్నాడో తెలుసా?

Next Story

Most Viewed