- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహేష్ బాబు ‘SSMB-29’ కోసం రంగంలో హాట్ బ్యూటీని దింపుతున్న జక్కన.. ప్లాన్ మామూలుగా లేదుగా!
సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ఓ భారీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ఓ భారీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి రాజమౌళి(Rajamouli) దర్శకత్వం వహిస్తుండగా.. ‘ఎస్ఎస్ఎంబి-29’ (SSMB-29)వర్కింగ్ టైటిల్‌తో రాబోతుంది. ఈ యాక్షన్ అడ్వెంచర్ మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రం నుంచి ఎప్పుడెప్పుడు అప్డేట్స్ వస్తాయా? అని అంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో.. జక్కన్న నవంబర్‌లో అభిమానులకు సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
భారీ అంచనాల నేపథ్యంలో రాబోతున్న ‘ఎస్ఎస్ఎంబి-29’ వచ్చే ఏడాది విడుదల కాబోతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాధారణంగా ప్రతి సినిమాలో స్పెషల్ సాంగ్‌లకు మంచి డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. ఎవరు ఊహించని భామలు ఐటమ్ సాంగ్స్ చేస్తూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నారు. ఇక సూపర్ స్టార్ కోసం జక్కన్న కూడా బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌ను రంగంలోకి దింపనున్నట్లు సమాచారం. తన అద్భుతమైన డాన్స్ ఫెర్ఫార్మెన్స్‌తో సినిమాకే హైలెట్‌గా నిలవబోతున్నట్లు టాక్.
ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు మహేష్ బాబుతో జాక్వెలిన్ స్పెషల్ సాంగ్ చేయబోతుందన్న విషయం వినడానికి చాలా అద్భుతంగా ఉంది.. రాజమౌళి ప్లాన్ మామూలుగా లేదని అంటున్నారు. కాగా, ఈ చిత్రాన్ని శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాను ఏకంగా 120 దేశాల్లో విడుదల చేయడాలనికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.






