విదేశాలపై మహేష్ బాబు కన్ను..? దుబాయ్‌లో భారీ పెట్టుబడులు..!!

by Disha Web Desk 7 |
విదేశాలపై మహేష్ బాబు కన్ను..? దుబాయ్‌లో భారీ పెట్టుబడులు..!!
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారు. అటూ కమర్షియల్ యాడ్స్‌ చేస్తూనే.. ఇటూ బిజినెస్‌లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నారు మహేశ్. ఇప్పటికే ఏఎంబీ సినిమాల్లో భాగస్వామిగా ఉండటంతో పాటు టెక్స్‌టైల్స్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అంతే కాకుండా.. ఇటీవల నమ్రతా పేరు మీదుగా హోటల్స్ కూడా స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఎంత బిజీగా ఉన్నప్పటికీ వేకేషన్‌కి ఫ్యామిలీతో అప్పుడప్పుడు విదేశాలకు చెక్కేస్తుంటారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు కన్ను విదేశీ పెట్టుబడులపై పడిందని టాక్.

రీసెంట్‌గా కోట్లు ఖర్చు పెట్టి దుబాయ్‌లో ఖరీదైన ప్లాట్‌ను కొనుగోలు చేశారని ఫిలీంనగర్‌లో వార్తలు గుప్పుమంటున్నాయి. వీటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పనుల మీద వేకేషన్ పేరుతో మహేశ్ దుబాయ్‌కి వెళ్లారని సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే.. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ.. మహేశ్ రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెడుతున్నారన్న వార్తలు మాత్రం హాట్ టాపిక్‌గా మారాయి. మరి దీనిపై మహేష్ బాబు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి : ‘Bhola Shankar :భోళా శంకర్’ను టెన్షన్ పెడుతున్న కీర్తి సురేష్?

Next Story

Most Viewed