Mahesh Babu: ఆ రోజు ఈ సినిమాను సర్వనాశనం చేసింది మహేష్ బాబు ఫ్యాన్స్.. నిర్మాత షాకింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2025-05-30 12:02:22  IST  )

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), అనుష్క శెట్టి(Anushka Shetty) కాంబోలో వచ్చిన మూవీ ‘ఖలేజా’(Khaleja).

Mahesh Babu: ఆ రోజు ఈ సినిమాను సర్వనాశనం చేసింది మహేష్ బాబు ఫ్యాన్స్.. నిర్మాత షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), అనుష్క శెట్టి(Anushka Shetty) కాంబోలో వచ్చిన మూవీ ‘ఖలేజా’(Khaleja). త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్(Prakash Raj) కీలక పాత్రలో కనిపించారు. అయితే దీనిని శింగనమల రమేశ్, సి. కళ్యాణ్ లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ఇది. మణిశర్మ సంగీత దర్శకత్వం వహించాడు. ఈ మూవీ 2010లో విడుదలై ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఇప్పుడు మళ్లీ ఈ సినిమాను మే 29న రీరిలీజ్ చేశారు. దీంతో మహేష్ బాబు అభిమానులు హాడావిడి మామూలుగా లేదు. ఆయన సినిమాను మళ్లీ చూస్తే థియేటర్స్‌లో సంచలనం సృష్టిస్తున్నారు. మరికొందరు మాత్రం ఊహించవిధంగా ప్రవర్తిస్తూ అందరినీ షాక్‌కు గురి చేస్తున్నారు.

అయితే ఓ నెటిజన్లు థియేటర్‌కు బతికున్న పామును చేతులో పట్టుకుని వెళ్లి అందరినీ భయబ్రాంతులకు గురి చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఈవెంట్‌లో పాల్గొన్న నిర్మాత సి కళ్యాణ్ (C Kalyan)షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘‘ఖలేజా సినిమాను చంపేసింది. మహేష్ బాబు ఫ్యాన్సే. వాళ్ళు ఒకటి ఊహించేసుకుని మహేష్ బాబు యాక్టింగ్ వాళ్ళకు అర్ధం కాలేదు. మమ్మల్ని చాలా తిట్టారు. ఆ రోజు మిడ్‌నైట్ షో అన్నారు. షో అయ్యాక తాగేసి ఫోన్ చేసి బూతులు తిట్టారు. ఓరేయ్ మీకు సినిమా తీయటం తెలుసా అని దారుణంగా మాట్లాడారు. డైరెక్టర్‌ను కూడా తిట్టారు.

వాళ్లే మెసేజ్‌లు పెట్టుకుని సర్వనాశనం చేశారు. ఈరోజు ఆ అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు. ‘ఖలేజా’ బిగ్ స్క్రీన్‌పై వస్తుంటే.. చూసి వాళ్ళే మళ్లీ ఒప్పుకుంటారు గతంలో సినిమా తీసిన వాళ్ళను తిట్టి తప్పు చేశామని. 15 సంవత్సరాల తర్వాత ఈ మూవీకి సక్సెస్ రావాలని రాసిపెట్టి ఉంది. కచ్చితంగా సక్సెస్ మీట్‌లో మళ్లీ కలుస్తాం’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

Next Story