'ది ఫేమ్ గేమ్‌' న్యూ అప్‌డేట్.. ఫిబ్రవరి 25నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో

by Web Desk |
ది ఫేమ్ గేమ్‌ న్యూ అప్‌డేట్.. ఫిబ్రవరి 25నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో
X

దిశ, సినిమా : బాలీవుడ్ సీనియర్ నటి మాధురి దీక్షిత్ 'ది ఫేమ్ గేమ్‌'తో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో ఎంట్రీకి సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన టీజర్‌ను గతేడాదే రిలీజ్ చేసిన మేకర్స్.. ఈ సిరీస్‌ను 2022 ఫిబ్రవరిలో విడుదల చేయనున్నట్లు తాజాగా వెల్లడించారు. ముందుగా 'అనామికా' పేరుతో ప్రారంభమైన సిరీస్‌లో సూపర్‌స్టార్ పాత్రను పోషిస్తున్న మాధురి.. ప్రస్తుతం 'ది ఫేమ్ గేమ్' అనే కొత్త టైటిల్‌‌తో రాబోతోందంటూ ఇన్‌స్టా వేదికగా న్యూ పోస్టర్‌ షేర్ చేసింది. ఇక ఈ సిరీస్‌ను ధర్మాటిక్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కరణ్ జోహార్ నిర్మిస్తుండగా.. బిజోయ్ నంబియార్ - కరిష్మా కోహ్లీ దర్శకత్వం వహించారు. సంజయ్ కపూర్, మానవ్ కౌల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. కాగా నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 25 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

https://www.instagram.com/p/CZOafw0sHyO/?utm_source=ig_web_copy_link

Next Story

Most Viewed