Madhuri Dixit: అతనితో పెళ్లి.. కష్టంగా ఫీల్ అయ్యానంటున్న నటి

by Disha Web Desk 10 |
Madhuri Dixit: అతనితో పెళ్లి.. కష్టంగా ఫీల్ అయ్యానంటున్న నటి
X

దిశ, సినిమా: సీనియర్ నటి మాధురి దీక్షిత్ తన పెళ్లి విషయంపై ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆమె ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భర్త శ్రీరామ్‌ను పెళ్లి చేసుకోవడం కష్టంగా భావించానని చెప్పింది. ఎందుకంటే ఆయన పగలు, రాత్రి తేడా లేకుండా రోగుల దగ్గర పని చేయడం వల్ల ఇంటి బాధ్యతంతా తానే చూసుకోవాల్సి వస్తుందని ఆందోళన చెందినట్లు తెలిపింది. ‘పిల్లలను స్కూల్‌కు తీసుకెళ్లిరావడంతోపాటు వాళ్ల బాగోగులు ఒంటరిగా చూసుకోవాల్సి వచ్చేది. ఆయనెప్పుడూ బిజీగా ఉండేవారు. నేను అనారోగ్యం పాలైతే నా పరిస్థితి ఏంటని భయం వేసేది. కొన్నిసార్లు ఇద్దరం మాట్లాడుకోవడం కూడా కుదిరేది కాదు. రోగుల ప్రాణాలను నా భర్త కాపాడుతున్నాడని కొంచెం గర్వంగా అనిపించినా.. వ్యక్తిగతంగా స్వార్థం ఉండేది’ అని చెప్పుకొచ్చింది. చివరగా తమ ఇద్దరి మధ్య అనురాగం, ఆప్యాయత గొప్పగా ఉండేదన్న మాధురీ.. నేటి యువతరం భాగస్వామి గురించి పూర్తిగా తెలుసుకుని ఒకరినొకరు అర్థం చేసుకోవాలని సూచించింది.

Next Story