- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సుప్రభాత సేవలో హీరోయిన్ మధుబాల
by Jakkula.Mamatha |
శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రముఖ సినీ హీరోయిన్ మధుబాల దర్శించుకున్నారు.

X
దిశ, తిరుమల: శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రముఖ సినీ హీరోయిన్ మధుబాల దర్శించుకున్నారు. బుధవారం ఉదయం ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి నిర్వహించిన సుప్రభాత సేవలో పాల్గొని,మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం మధుబాల ను వేద పండితులు ఆశీర్వదించి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందించారు. దర్శనం చేసుకున్నాక ఆలయం వెలుపలకు వచ్చిన మధుబాల తన మొబైల్ ద్వారా తానే స్వయంగా సెల్ఫీ ఫోటోలు తీసుకుంటూ మాడా వీధులలో కలియతిరిగారు. అంతేకాకుండా తన దగ్గరకు వచ్చి పలకరించిన భక్తులతో ఆమె ఫోటోలు దిగుతూ వారిని ఉత్సాహపరిచారు. 90వ దశకం నుంచి మధుబాల ఒక భారతీయ చలనచిత్ర నటిగా హిందీ, తమిళ, తెలుగు, మలయాళ భాషలలో సుమారు 52 చలన చిత్రాల్లో నటించారు. తన నటనతో ఇటు ప్రేక్షకులు, అటు విమర్శకుల నుంచి అనేక ప్రశంసలు పొందారు.
Next Story






