- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Madhavan: వరదల్లో చిక్కుకున్న హీరో.. తన పరిస్థితి గురించి వివరిస్తూ పోస్ట్ పెట్టడంతో కంగారు పడుతున్న అభిమానులు
గత కొద్ది రోజులుగా అన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది.

దిశ, సినిమా: గత కొద్ది రోజులుగా అన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. దీంతో పలుచోట్ల వాగులు, చెరువులు పొంగిపొర్లుతుండటంతో నీటి ప్రవాహం అధికమై రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇక కొన్ని చోట్ల ప్రమాదక హెచ్చరికలు సైతం జారీ చేయడంతో.. వరదల్లో చిక్కుకున్న వారిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు చేరుస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. జమ్మూకాశ్మీర్‌లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా తాను లేహ్‌లో చిక్కుక్కుపోయినట్లు తెలుపుతూ హీరో మాధవన్(R Madhavan) ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసిన వీడియో అభిమానులను కంగారు పెడుతోంది. ‘‘ఆగస్టు నెలాఖరులో, లడఖ్‌లోని పర్వత శిఖరాలపై ఇప్పటికే మంచు కురుస్తోంది.
గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా విమానాశ్రయాల రాకపోకలు నిలిచిపోయాయి. నేను లేహ్‌లో చిక్కుకున్నాను. ఏదో విధంగా, నేను లడఖ్‌లో షూటింగ్ కోసం వచ్చిన ప్రతిసారీ, అదే జరుగుతుంది. 2008లో ‘త్రీ ఇడియట్స్’ సినిమా షూటింగ్ కోసం ఇక్కడికి వచ్చాను. అప్పుడు కూడా అకస్మాత్తుగా మంచు విపరీతంగా కురవడంతో మేము ఇక్కడే ఉండాల్సి వచ్చింది. ఈ ప్రాంతం ఎలా ఉన్నప్పటికీ అందంగానే ఉంటుంది. ఈరోజైనా వర్షం తగ్గాలని విమానాల రాకపోకలు సాగి నేను ఇంటికి చేరుకోవాలని కోరుకుంటున్నాను. నేను ఇక్కడే సురక్షితంగానే ఉన్నాను’’ అని చెప్పుకొచ్చారు. ఇక ఈ విషయం తెలుసుకున్న ఆర్ మాధవన్ అభిమానులు కంగారు పడుతూ ఆయన త్వరగా ఇండియా చేరుకోవాలని దేవుడికి మొక్కుతున్నారు.






