- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హై యాక్షన్ సీక్వెన్స్‌లో మాచోస్టార్.. ఆ సినిమాపై భారీ హైప్
మాచో స్టార్ గోపీచంద్ (gopichand) తన ప్రెస్టీజియస్ హిస్టారికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘గోపీచంద్33’లో నటిస్తున్నారు.

దిశ, సినిమా: మాచో స్టార్ గోపీచంద్ (gopichand) తన ప్రెస్టీజియస్ హిస్టారికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘గోపీచంద్33’లో నటిస్తున్నారు. విజనరీ డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి (sankalp reddy) దర్శకత్వంలో, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ (pawan kumar) సమర్పణలో ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో రాబోతుంది. ఈ చిత్రం ఇప్పటికే నాలుగు షెడ్యూల్‌లు, 55 రోజుల షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. తాజాగా, మరో షెడ్యూల్ స్టార్ట్ చేసినట్లు చిత్రబృందం వెల్లడించింది. హీరో గోపిచంద్‌తో పాటు ప్రధాన తారాగణంపై వెంకట్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఓ భారీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాలో మెయిన్ హైలైట్‌గా నిలుస్తుందని మూవీ మేకర్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వనుందని అంచనాలను పెంచుతున్నారు. అద్భుతమైన ఎమోషన్స్, విజువల్ గ్రాండ్యూర్‌తో ప్రేక్షకులకు ఒక వినూత్న అనుభూతిని అందించబోతున్నారు. గోపిచంద్ తన కెరీర్‌లో ఎన్నడూ చేయని విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. దీంతో గోపీచంద్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.






