చిరంజీవి చేతికి ఆస్కార్.. జోష్లో ‘భోళా శంకర్’ టీమ్..!

by Dishafeatures2 |
చిరంజీవి చేతికి ఆస్కార్.. జోష్లో ‘భోళా శంకర్’ టీమ్..!
X

దిశ, వెబ్ డెస్క్: ఆస్కార్ అవార్డును పైకెత్తి తదేకంగా దానివైపే చూస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అయితే చిరుకు ఆస్కార్ ఎప్పుడు వచ్చింది? ఆయన చేతిలో ఆస్కార్ ఏంటీ? అనే సందేహం కలుగుతోందా? అయితే మెగాస్టార్ చేతికి ఆస్కార్ ఎలా వచ్చిందో తెలియాలంటే ఈ వార్త మొత్తం చదవాల్సిందే. దిగ్గజ డైరెక్టర్ రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీలోని ‘నాటు నాటు’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటాగిరీలో ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోస్ ఈ ఆస్కార్ అవార్డులను అందుకున్నారు. కాగా తాజాగా ఆస్కార్ విజేత చంద్రబోస్ మెగాస్టార్ నటిస్తున్న భోళా శంకర్ సినిమా షూటింగ్ సెట్ కు వచ్చారు. ఈ సందర్భంగా భోళా శంకర్ యూనిట్ చంద్రబోస్ ను అభినందించారు. అనంతరం చంద్రబోస్ ను చిరంజీవి హగ్ చేసుకున్నారు.

ఈ క్రమంలోనే చంద్రబోస్ ఆస్కార్ అవార్డును మెగాస్టార్ చేతికిచ్చారు. దీంతో చిరంజీవి ఆస్కార్ అవార్డును పైకెత్తి కొద్దిసేపు దాని వంకే చూశారు. అనంతరం చిరంజీవి ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలను తన ట్విట్టర్ లో షేర్ చేశారు. ‘‘95 ఏళ్ల ఆస్కార్ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఆస్కార్ వేదిక మీద ఓ తెలుగు పాట వినపడింది. నాటు నాటు పాట రాసి ఆస్కార్ సాధించి మాతృభూమికి తిరిగొచ్చిన నీకు (చంద్రబోస్) ఈ భోళా శంకర్ సెట్ లోకి మనస్పూర్తిగా స్వాగతం చెబుతున్నాం ’’ అంటూ మెగాస్టార్ చిరంజీవి గేయ రచయిత చంద్రబోస్ ను ఆకాశానికెత్తారు. ఇక చిరు షేర్ చేసిన ఫోటోల్లో మెగాస్టార్, చంద్రబోస్లతో పాటు భోళా శంకర్ డైరెక్టర్ మెహర్ రమేశ్, ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.



Next Story

Most Viewed