ఆకట్టుకుంటున్న ‘విరూపాక్ష’ లిరికల్ సాంగ్

by Disha Web Desk 7 |
ఆకట్టుకుంటున్న ‘విరూపాక్ష’ లిరికల్ సాంగ్
X

దిశ, సినిమా : సుప్రీమ్‌ హీరో సాయి ధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ నుంచి మరో అప్‌‌డేట్ ఇచ్చారు మేకర్స్. సంయుక్తా మీనన్ కథానాయికగా నటించిన సినిమా నుంచి ‘నచ్చావులే నచ్చావులే’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ స్వరాలు సమకూర్చిన ఈ మెలోడీ సాంగ్‌కు కృష్ణకాంత్ సాహిత్యం సమాకూర్చగా కార్తీక్ ఆలపించగా.. ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక 1990లో ఓ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న విచిత్ర సమస్యకు కథానాయకుడు పరిష్కారం చూపించడమే కథ. కాగా కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న సినిమాను.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Next Story

Most Viewed