- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టాలీవుడ్ హీరోయిన్‌తో ప్రేమ.. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నానంటూ క్లారిటీ ఇచ్చేసిన యంగ్ డైరెక్టర్!
షార్ట్ ఫిలిమ్స్ ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుని సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ((Tharun Bhascker Dhaassyam))కమెడీయన్‌గా కూడా ప్రేక్షకులను నవ్వించారు.

దిశ, సినిమా: షార్ట్ ఫిలిమ్స్ ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుని సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ((Tharun Bhascker Dhaassyam))కమెడీయన్‌గా కూడా ప్రేక్షకులను నవ్వించారు. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక ఇటీవల ‘కీడా కోలా’ సినిమాతో వచ్చిన ఆయన మరో హిట్ అందుకున్నారు. ప్రస్తుతం దర్శకుడిగానే కాకుండా.. నటుడిగానై వరుస అవకాశాలు అందుకుంటున్నారు. తరుణ్ భాస్కర్ నటిస్తున్న చిత్రాల్లో ‘ఓం శాంతి శాంతి శాంతి’ (Om Shanti Shanti Shanti)ఒకటి. ఇందులో ఈషా రెబ్బా (Isha Rebba)హీరోయిన్‌గా నటిస్తోంది.
ఏఆర్ సజీవ్ దర్శకత్వంలో తెరకెక్కుతుండగా.. ఎస్ ఒరిజినల్స్, మూవీ వర్స్ స్టూడియెస్ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ఆగస్టులో విడుదల కావాల్సి ఉండగా వాయిదా పడింది. ఇదిలా ఉంటే.. తరుణ్ భాస్కర్ టాలీవుడ్ బ్యూటీ ఈషా రెబ్బాను ప్రేమిస్తున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరు కలిసి దీపావళి రోజున కలిసి కనిపించడంతో పుకార్లకు బలం చేకూరినట్లు అయింది. అదీ కాక ఇద్దరు వరంగల్ జిల్లాకు చెందినవారు కావడంతో.. అంతా ఈ వార్తలు నిజమే అని నమ్ముతున్నారు. ఎన్ని వార్తలు వచ్చినప్పటికీ ఈషా, తరుష్ అధికారికంగా స్పందించడం లేదు.
దీంతో వీరిద్దరి ప్రేమకు సంబంధించిన వార్తలెన్నో వస్తున్నాయి. ఈక్రమంలోనే.. తాజాగా, ఓ సినిమా ఈవెంట్‌లో పాల్గొన్న తరుణ్ మొత్తానికి లవ్ విషయంపై ఓపెన్ అయ్యారు. ‘రాజు వెడ్స్ రాంబాయి’ ప్రీ రిలీజ్ వేడుకల్లో మీరు చూసిన గ్రేట్ లవ్ స్టోరీ ఎవరిది? అని యాంకర్ అడగ్గా.. నాదే నేను నా లవ్‌ను చాలా ఎంజాయ్ చేస్తున్నాను అని హింట్ ఇచ్చేశాడు. దీంతో యాంకర్ కూడా అవును ఆమె పేరు నాకూడా తెలుసు కానీ పేరు చెప్పను అనడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. ఇక ఈ ఈవెంట్‌కు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండటంతో తరుణ్, ఈషాతోనే లవ్ ఉన్నాడని అంతా గుసగుసలాడుకుంటున్నారు.






