పబ్లిక్‌గా Anchor Suma కు లవ్ ప్రపోజల్.. (వీడియో)

by sudharani |
పబ్లిక్‌గా Anchor Suma కు లవ్ ప్రపోజల్.. (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: బుల్లి తెర స్టార్.. యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తరాలు మారుతున్న ఇండస్ట్రీకి ఎంతో మంది కొత్త యాంకర్లు వస్తున్నప్పటికీ.. అప్పటికీ ఇప్పటికీ సుమ క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇదిలా ఉంటే సుమ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న షో 'క్యాష్'. ఈ షోకు సంబంధించిన తాజా ఎపిసోడ్ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ప్రోమోలో ప్రభాస్ శ్రీను, హరితేజ, హేమ, ప్రవీణ్ అలరించారు. వారి మాటలతో, సుమ పంచులతో ప్రోమో ఎంతో ఇంట్రెస్టింగ్‌గా సాగింది. అయితే ప్రోమో చివరిలో మాత్రం.. సుమ కాలేజ్ అమ్మాయిగా నిలబడి ఉండి.. స్టూడెంట్స్ నుంచి ఓ అబ్బాయి వచ్చి సుమకు లవ్ ప్రపోజల్ చేయడం ప్రోమోలో హైలెట్ అయింది. ఆ వెంటనే సుమ తన కౌంటర్‌తో నవ్వులు పూయించింది. కాగా.. దీనికి సంబంధించిన క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Next Story

Most Viewed