విడుదలకు సిద్ధమైన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’.. ఈ సారైనా అదృష్టం కలిసొచ్చేనా?

by Mallepaka Hamsa |

‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ చిత్రం ఎట్టకేలకు విడుదలకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది.

విడుదలకు సిద్ధమైన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’.. ఈ సారైనా అదృష్టం కలిసొచ్చేనా?
X

దిశ, సినిమా: వరుస విజయాలతో యూత్ ఐకాన్‌గా మారిన యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటిస్తున్న లేటెస్ట్ క్రేజీ మూవీ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIC). ‘డ్రాగన్’ వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత ప్రదీప్ నుండి వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. టాలెంటెడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బేబమ్మ కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా, వెర్సటైల్ నటుడు ఎస్.జె. సూర్య ఒక కీలక పాత్రలో మెరవనున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలై చాలా కాలమే అయినప్పటికీ, రకరకాల కారణాల వల్ల విడుదల వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పటికే పలుమార్లు రిలీజ్ డేట్స్ ప్రకటించినా, సాంకేతిక కారణాల వల్ల సినిమా థియేటర్లకు రాలేకపోయింది. దీంతో అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. అయితే, ఇప్పుడు వారందరికీ ఒక తీపి కబురు అందుతోంది.

ఈ చిత్రం ఎట్టకేలకు విడుదలకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ చిత్రం ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. గుడ్ ఫ్రైడే సెలవు దినాన్ని పురస్కరించుకుని ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఒక పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. విఘ్నేష్ శివన్ మార్క్ కామెడీ ,ప్రదీప్ రంగనాథన్ ఎనర్జీ తోడైతే ఈ వేసవిలో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా గట్టి సౌండ్ చేయడం ఖాయమని నెటిజన్లు అంటున్నారు. అంతేకాకుండా ఎన్నోసార్లు వాయిదా పడిన ఈ సినిమా ఈ సారైనా విడుదల అవుతుందా? కృతికి, ప్రదీప్‌కు, మూవీ మేకర్స్‌కు అదృష్టం కలిసొస్తుందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Next Story