Love At First Sight: లవ్ అండ్ అట్రాక్షన్‌పై యువతలో చర్చ.. ప్రేమా.. వ్యామోహమా..? నిపుణులు తేల్చింది ఇదే..!

by Bhoopathi Nagaiah |

నెట్‌ఫ్లిక్స్‌లో ‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్’ చూశారా? సూపర్ సక్సెస్ అయిన ఈ ప్రాజెక్ట్‌పై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.

Love At First Sight: లవ్ అండ్ అట్రాక్షన్‌పై యువతలో చర్చ.. ప్రేమా.. వ్యామోహమా..? నిపుణులు తేల్చింది ఇదే..!
X

దిశ, ఫీచర్స్ : నెట్‌ఫ్లిక్స్‌లో ‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్’ చూశారా? సూపర్ సక్సెస్ అయిన ఈ ప్రాజెక్ట్‌పై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. నిజంగా తొలి చూపులో ప్రేమ కలుగుతుందా? అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. రోమ్‌కామ్స్‌లో స్క్రీన్‌పై చూపించినట్లుగా రియల్‌ లైఫ్‌లోనూ ఆ స్పార్క్ ఉంటుందా? అని అడుగుతున్నారు. దీన్ని రెండు మనుసులు ఒకే క్షణంలో కలిసిపోవడం అంటారా? లేక శృంగార భరిత ఆలోచనగా పరిగణిస్తారా? ఫస్ట్ మీటింగ్‌లోనే అమేజింగ్ స్టోరీస్ స్టార్ట్ అవుతాయని అంటారు కదా.. ఇంతకీ ‘Love At First Sight’ గురించి సైన్స్ ఏం చెప్తుంది? 60శాతం మంది వ్యక్తులు నిజంగానే ఫస్ట్ సైట్‌లోనే ప్రేమను అనుభవించారా? లేక మోహమా? అనే విషయాల గురించి తెలుసుకుందాం.

సైన్స్ ఏం చెప్తుంది?

‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్’ వెనుక సైన్స్ ఉందని కొందరు అంటున్నారు. ఎందుకంటే వ్యక్తిలో ఆక్సిటోసిన్ అండ్ డోపమైన్ వంటి ‘హ్యాపీ హార్మోన్స్’ లెవల్స్ పెరుగుదల ఇందులో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని, అందుకే లవ్ అనేది మెదడులోని ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ పార్టులో నిమగ్నం అయ్యేలా ప్రేరేపిస్తుందని సైంటిస్టులు చెప్తున్నారు. వాస్తవానికి మన ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ రోజంతా కనీస ఇన్ఫర్మేషన్‌తో చాలా డెసీషన్స్ తీసుకుంటుంది. అందులో మొదటి చూపులోనే ప్రేమను అంగీకరించడం కూడా ఒకటి అని డాక్టర్ ఆల్బర్స్ అంటున్నారు. అంతేకాదు మీరు ఎవరినైనా చూడగానే సెకన్లలో వారిపట్ల ఆకర్షితులవుతున్నారో లేదో మీకే అర్థం అవుతుంది. సెక్స్ హార్మోన్స్ అయిన టెస్టోస్టెరాన్ అండ్ ఈస్ట్రోజెన్ ఈ బేసికల్ ఫిజికల్ అట్రాక్షన్‌లో కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి ప్రారంభ క్షణాలు అద్భుతంగా, ఆకర్షణీయంగా అనిపిస్తాయి.

లవ్‌ను ప్రేరేపించేది ఏది?

లుక్, స్మైల్, స్మెల్ వంటివి కూడా లవ్‌ను ప్రేరేపించే అంశాలుగా ఉంటాయని ఒక మ్యారేజ్ బ్యూరో నిపుణుడు పేర్కొన్నాడు. అంతేకాదు, ఒక వ్యక్తి కనిపించే తీరు అంటే బాడీ లాంగ్వేజ్, క్లాతింగ్, సెంట్, స్పీచ్ వంటి వాటిలో ఏదో ఒకటి అట్రాక్ట్ అయ్యేలా చేయవచ్చు. అయితే రట్జర్స్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ హెలెన్ ఫిషర్ మాత్రం ప్రేమను కామం, అట్రాక్షన్, అటాచ్‌మెంట్ అనే మూడు భాగాలుగా విభజించాడు. కామం విషయానికి వస్తే లైంగిక తృప్తి కోసం కోరిక ద్వారా అది నడపబడుతుంది. ఇక అట్రాక్షన్ అనేది హై లెవల్స్ డోపమైన్ అండ్ నోర్‌పైన్‌ఫ్రైన్ ఉంటాయి. అటాచ్‌మెంట్ అనేది దీర్ఘకాలిక బంధానికి సంబంధించినదని హెలెన్ ఫిషర్ అంటున్నాడు.

ఎవరు నమ్ముతారు?

‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్’ అనే కాన్సెప్ట్‌ను చాలామంది నమ్ముతారు. 72 శాతం మంది పురుషులు దీనిని నమ్ముతుండగా, 61 శాతం మంది మహిళలు కూడా విశ్వసిస్తున్నారని ఎలైట్ సింగిల్స్ సర్వేలో వెల్లడైంది. 2013లో వెరోనికా హెఫ్నర్ అండ్ బార్బరా J విల్సన్ 335 మంది కాలేజ్ స్టూడెంట్స్‌ను రొమాంటిక్ మూవీస్ చూశాక వారి అభిప్రాయాలు ఎలా మారిపోతాయో తెలుసుకోవడానికి ఒక సర్వే చేశాడు. దీని ప్రకారం.. రోమ్‌కామ్‌లను చూసే వ్యక్తులు ఆదర్శవంతమైన రొమాంటిక్ ఐడియల్స్ కలిగి ఉంటారు. అలాగే త్వరగా ప్రేమలో పడే అవకాశం కూడా ఉంది. అయితే ‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్’ కాన్సెప్ట్‌తో ఇనీషియల్ స్పార్క్‌పై తరచూ ఆశలు పెట్టుకోవడాన్ని నిపుణులు మూర్ఖత్వంగా పరిగణిస్తున్నారు. ప్రేమను కామం లేదా మోహంతో గందరగోళానికి గురిచేసే ప్రమాదాల గురించి హెచ్చరిస్తున్నారు. ఇన్‌స్టాంట్ కెమిస్ట్రీ అనేది రిలేషన్‌షిప్ అవకాశాలకు మంచి సూచిక కాదు, అలాగని ఎల్లప్పుడూ ప్రమాదం కూడా కాదు.

Next Story