- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్టార్ హీరోలతో మల్టీస్టారర్ ప్లాన్ చేసిన లోకేష్.. ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.. సంచలనంగా మారిన ట్వీట్
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) వరుస ప్రాజెక్ట్స్‌తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) వరుస ప్రాజెక్ట్స్‌తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు. ఇటీవల ‘కూలీ’ మూవీతో ప్రేక్షకులను అలరించారు కానీ హిట్ అందుకోలేకపోయారు. ప్రస్తుతం ఖైదీ-2, బెంజ్, విక్రమ్-2 వంటి చిత్రాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా, లోకేష్ కనగరాజ్ ఓ మల్టీస్టారర్ మూవీ ప్లాన్ చేస్తున్నట్లు పలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరోలు కమల్ హాసన్(Kamal Haasan), రజినీకాంత్(Rajinikanth) కాంబోలో ఓ భారీ ప్రాజెక్ట్ చేయనున్నట్లు టాక్. ఇద్దరు ఓల్డ్ గ్యాంగ్ స్టార్స్ కలిసి మాఫియాను ఎలా శాసించారు అనే కథతో చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందులో కమల్ హీరోగా నటిస్తుండగా.. రజినీ విలన్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారట.
ఈ సినిమాకు సంబంధించిన కథ విషయంలో చర్చలు కూడా జరగడంతో వారిద్దరు నటించేందుకు ఒప్పుకోగా.. త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టబోతున్నారట.ఇక ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిల్మ్స్ బ్యానర్‌పై కమల్ హాసన్ నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. అది చూసిన అభిమానులు ఈ మూవీ కనుక వస్తే ఇండస్ట్రీ షేక్ అవడం ఖాయం అని అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమాలో కమల్, రజినీ మాత్రమే ఉంటారా.. లేక ఎవరైనా హీరోలు నటిస్తారా? అని చర్చించుకుంటున్నారు.






