- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హాట్ టాపిక్‌గా మారిన లోకేష్ కనగరాజ్ రెమ్యునరేషన్.. డెబ్యూ సినిమాకే అన్ని కోట్లా?
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) ఖైదీ, లియో, విక్రమ్, కూలీ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తెరకెక్కించి ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నారు.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) ఖైదీ, లియో, విక్రమ్, కూలీ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తెరకెక్కించి ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నారు.పలు బ్లాక్ బస్టర్ హిట్స్‌తో ఇండస్ట్రీని షేక్ చేశాడు. ప్రస్తుతం కొన్ని భారీ ప్రాజెక్ట్స్ తెరకెక్కించాల్సి ఉండగా.. డైరెక్షన్‌కు దూరం అయ్యాడు. అన్ని షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చి హీరోగా స్క్రీన్‌పై కనిపించబోతున్నాడు. లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై తన డెబ్యూ సినిమా తెరకెక్కబోతోంది. అరుణ్ మథేశ్వరన్(Arun Matheswaran) దర్శకత్వం వహిస్తుండగా.. DC వర్కింగ్ టైటిల్‌తో రాబోతుంది. బాలీవుడ్ బ్యూటీ వామికా గబ్బి(Wamika Gabbi) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ కూడా విడుదలై ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేసింది.
స్టైలిష్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో బలమైన భావోద్వేగపూరిత అంశాలతో రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుండగా.. త్వరలో షూటింగ్ కూడా ప్రారంభించబోతున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఓవార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ‘DC’ చిత్రానికి లోకేష్ ఏకంగా రూ. 35 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు టాక్. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ.. ప్రజెంట్ ఈ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇది నిజమైతే మాత్రం సౌతిండియాలో ఇప్పటి వరకు డెబ్యూ సినిమాకు ఇంత రెమ్యునరేషన్ తీసుకున్న వన్ అండ్ ఓన్లీ హీరోగా లోకేష్ చరిత్ర సృష్టించబోతున్నాడు.






