రజినీతో లోకేష్ కనగరాజన్ సినిమా..!

by Disha Web Desk 1 |
రజినీతో లోకేష్ కనగరాజన్ సినిమా..!
X

దిశ, వెబ్ డెస్క్: లోకేష్ క‌న‌గ‌రాజ్ తమిళ ఇండస్ట్రీలో ఇప్పుడు మారుమోగుతున్న పేరు. ఖైదీ, విక్రమ్ సినిమాల‌తో అనతి కాలంలోనే విజయవంతమైన దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు. కొన్నేళ్లుగా ఎవ‌రికీ సాధ్యం కాని విధంగా క‌మ‌ల్‌హాస‌న్‌తో రూ.300కోట్ల బ్లాక్ బస్టర్ సినిమా తీసి ఇండస్ర్టీ రికార్డులను తిరగరాశాడు. ప్రస్తుతం అతను నటుడు విజయ్ తో తీస్తున్న లియోపై ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలు ఓ రేంజ్ ఉన్నాయి.

కేవలం ఈ సినిమా ఓవ‌ర్సీస్ రైట్స్ రూ.60 కోట్లకు అమ్ముడయ్యాయంటే ఆ మూవీ క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు. అదేవిధంగా ప్రస్తుతం జైల‌ర్ సినిమాతో బిజీగా ఉన్న సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్‌తో ఇటీవ‌లే లోకేష్ క‌థ‌కు సంబంధించిన ప్రాథ‌మిక చర్చలు జరిపారు. లోకేష కథ చెప్పే విధానానికి రజినీ కూడా ముగ్ధుడై సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం.

ఇవి కూడా చదవండి: Viduthalai : రికార్డ్స్ బ్రేక్ చేసిన కోలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్


Next Story

Most Viewed