- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లైవ్‌లో ఆస్కార్ అవార్డు వేడుకలు.. ఓటీటీలో స్ట్రీమింగ్

దిశ, సినిమా: సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డ్ ప్రదానోత్సవ కార్యక్రమం ఈవారం అమెరికాలో జరుగనుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రముఖులంతా అమెరికా బయలుదేరుతున్నారు. ఇప్పటికే మన టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి దర్శకుడు రాజమౌళి, రామ్ చరణ్, ‘RRR’ మూవీ ప్రమోషన్‌లో భాగంగా అమెరికాలోనే ఉండగా..తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం అమెరికా చేరుకున్నారు.
ఇక ఈ అవార్డు వేడుకలు చూసేందుకు ప్రేక్షకులు, సినీ ప్రియులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కార్యక్రమాన్ని టీవిలో చూడటం కుదరని వారికి ఓటీటీలో లైవ్ చూసే అవకాశం కల్పించేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకోసం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని హాట్‌స్టార్ ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించింది. సో మొత్తానికి ఈ ఆస్కార్ అవార్డు ఈవెంట్ లైవ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.
ఇవి కూడా చదవండి :
Jr.Ntr: కాలిఫోర్నియాలో అడుగుపెట్టిన యంగ్ టైగర్.. సాలిడ్ పోస్ట్ వైరల్






