- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గొడవల మధ్య మనోజ్ మరో ట్వీట్ వైరల్.. నా బతుకు నన్ను బతకనివ్వు అంటూ
మంచు ఫ్యామిలీలో వివాదాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: మంచు ఫ్యామిలీలో వివాదాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవలె మనోజ్ షేర్ చేసిన వీడియో ఆధారంగా ఆ గొడవలు నిజమేనని ఓ క్లారిటీ వచ్చింది. అయితే మనోజ్ షేర్ చేసిన వీడియోపై స్పందించిన విష్ణు మాత్రం ‘‘ఇది చాలా చిన్న గొడవ. ఇలాంటి గొడవలు మా ఇద్దరి మధ్య సర్వసాధారణం’’ అంటూ కొట్టిపారేశాడు.
ఇదిలా ఉంటే.. తాజాగా మనోజ్ మరో పోస్ట్ షేర్ చేశాడు. ‘‘తప్పుల మధ్య నిష్క్రియంగా జీవించడం కంటే సరైన వాటి కోసం పోరాడడం మంచిది.. ప్రతికూలత సృజనాత్మకతకు శత్రువు’’ అనే సుజి కాసీమ్ కోటేషన్‌ను షేర్ చేస్తూ.. జీవించండి జీవించనివ్వండి అనే క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ కోటెషన్ వైరల్ కావడంతో.. నెటిజన్స్ మనోజ్ షేర్ చేసిన గొడవ వీడియోకు ఈ పోస్ట్‌ను లింక్ చేస్తూ రకరకాలుగా స్పందిస్తున్నారు.
Live and let live 🙏🏼❤️ Love you all with all my heart. #ManchuManoj pic.twitter.com/ypecRuZwLG
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) March 25, 2023






