‘లిటిల్ హార్ట్స్’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. కొత్త ఉత్సాహాలు మీ కోసం వేచి ఉన్నాయంటూ హీరోయిన్ పోస్ట్

by Mallepaka Hamsa |

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శివాని నాగరం(Shivani Nagaram) ‘అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

‘లిటిల్ హార్ట్స్’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. కొత్త ఉత్సాహాలు మీ కోసం వేచి ఉన్నాయంటూ హీరోయిన్ పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శివాని నాగరం(Shivani Nagaram) ‘అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఒక్క చిత్రంతోనే అమ్మడు రేంజ్ మారిపోయింది. ప్రస్తుతం శివాని ‘లిటిల్ హార్ట్స్’(Little Hearts) మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నో టచింగ్స్.. ఓన్లీ హార్ట్ టచింగ్స్’ ట్యాగ్‌లైన్‌తో వస్తుంది. ఇందులో 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ ఫేమ్ మౌళి తనూజ్(Mouli Tanuj) హీరోగా నటిస్తుండగా.. సాయి మార్తాండ్(Sai Marthand) దర్శకత్వంలో తెరకెక్కుతోంది.

ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు సిన్‌జిత్ యర్రమల్లి సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి వరుస అప్డేట్స్ విడుదల అవుతున్నాయి. తాజాగా, ‘లిటిల్ హార్ట్స్’ రిలీజ్‌కు సిద్ధమైనట్లు తెలుపుతూ శివాని నాగరం ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. ‘‘ప్రేమ, నవ్వులు.. కొత్త ఉత్సాహాలు మీ కోసం వేచి ఉన్నాయి’’ అనే క్యాప్షన్ జత చేసింది. ‘లిటిల్ హార్ట్స్’ సినిమా సెప్టెంబర్ 12న థియేటర్స్‌లో రాబోతున్నట్లు తెలుపుతూ మౌళితో కలిసి ఉన్న పోస్టర్‌ను షేర్ చేసింది.

Next Story