‘శివ’లాగే నాగచైతన్య ‘కస్టడీ’ ఎప్పటికీ గుర్తుండిపోతుంది: నిర్మాత శ్రీనివాస చిట్టూరి

by Disha Web Desk 13 |
‘శివ’లాగే నాగచైతన్య ‘కస్టడీ’ ఎప్పటికీ గుర్తుండిపోతుంది: నిర్మాత శ్రీనివాస చిట్టూరి
X

దిశ, సినిమా: అక్కినేని నాగార్జున కెరీర్‌లో ‘శివ’ చిత్రం ఎలా గుర్తుండిపోయిందో నాగ చైతన్య కెరీర్‌లోనూ ‘కస్టడీ’ అలా నిలిచిపోతుదంటున్నాడు నిర్మాత శ్రీనివాస చిట్టూరి. నాగచైతన్య, వెంకట్ ప్రభుల కలయికలో వస్తున్న ‘కస్టడీ’ మూవీని పవన్‌కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. కృతి శెట్టి కథానాయికగా నటించిన చిత్రం మే 12న విడుదల కానుండగా విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలు పంచుకున్నాడు నిర్మాత.

‘కథ, మంచి స్క్రీన్ ప్లే, ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్‌ అన్ని కలగలిసిన సినిమా తెలుగు ప్రేక్షకులకు హాలీవుడ్ మూవీ చూసిన అనుభూతి కలిగిస్తుంది. ఇది నిజాయితీ గల ఒక కానిస్టేబుల్ కథ. యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. కథ వినగానే ఇళయరాజా, యువన్ శంకర్ రాజా ముందుకు రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది. కంటెంట్ పరంగా, బిజినెస్ పరంగా హ్యాపీగా ఉన్నాం. మూవీ బిగ్ హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి:

‘#NBK108’ నుంచి బిగ్ అప్‌డేట్.. పవర్‌ఫుల్ పాత్రలో బాలీవుడ్ నటుడు

Next Story