దీపావళి బరి నుంచి తప్పుకున్న ’lik’ .. కొత్త విడుదల తేదీని అనౌన్స్ చేస్తూ మేకర్స్ కీలక ప్రకటన

by Mallepaka Hamsa |   (  Updated:2025-10-07 05:56:32  IST  )

కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) ‘డ్రాగన్’ సినిమాతో హిట్ అందుకుని ఫుల్ జోష్‌లో ఉన్నాడు.

దీపావళి బరి నుంచి తప్పుకున్న ’lik’ .. కొత్త విడుదల తేదీని అనౌన్స్ చేస్తూ మేకర్స్ కీలక ప్రకటన
X

దిశ, సినిమా: కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) ‘డ్రాగన్’ సినిమాతో హిట్ అందుకుని ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ ఫుల్ బిజీ బిజీ అయిపోయాడు. త్వరలో ప్రదీప్ డ్యూడ్, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక ఈ రెండు సినిమాలు దీపావళి బరిలో ఉన్నాయి. రెండు ఒకేసారి రిలీజ్ కాబోతుండటంతో.. ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’(Love Insurance Company) మూవీని వాయిదా వేసినట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. రెండు సినిమాలు ఒక రోజు గ్యాప్‌తో విడుదల చేయడం చిత్రబృందానికి ఇష్టం లేకపొవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

తాజాగా, ఈ విషయంపై మూవీ మేకర్స్ స్పందిస్తూ ట్విట్టర్ ద్వారా అధికారిక ప్రకటనను విడుదల చేశారు. ‘‘ఈ రెండు సినిమాలు ఒకే ట్రాక్‌పై ఉన్న రెండు రైళ్లలాగే ఎదురెదురుగా ఢీకొనడం ఎవరికీ ఉపయోగపడదు. మా ప్రియమైన హీరో ప్రదీప్ రంగనాథన్ పట్ల నిజమైన ప్రేమతో ఈ రెండు చిత్రాల వెనుక ఉన్న కృషిని గౌరవిస్తూ.. మేము lik విడుదల వాయిదా వేస్తున్నాం. ఈ సినిమా డిసెంబర్ 18న రిలీజ్ చేయాలని ఆలోచనాత్మకంగా నిర్ణయించుకున్నాము. మైత్రీ మూవీస్ సమన్వయం చేసుకోవడానికి మేము ఎంత ప్రయత్నించినా.. మేము ఈ విషయంపై ఒక అభిప్రాయానికి రాలేకపోయాము. రెండు సినిమాలు ఒకదానికొకటి పోటీ పడకుండా.. దేనికదే ప్రకాశించేలా వాయిదా వేయడం తెలివైన పని అని మేము నమ్ముతున్నాము.

ప్రదీప్ రంగనాథన్, డ్యూడ్ టీమ్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ సంతోషకరమైన దీపావళికి ఘన విజయం సాధించాలని కోరుతున్నాము’’ అని రాసుకొచ్చారు. కాగా, ఈ చిత్రంలో ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా నటిస్తున్నారు.ఈ రొమాంటిక్ కామెడీ మూవీని స్టార్ హీరోయిన్ నయనతార భర్త విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఎస్ జె సూర్య, యోగిబాబు, గౌరీ జీ కిషన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను సెవెన్ స్క్రీన్ స్టూడియోస్, రౌడీ పిక్చర్స్ బ్యానర్‌పై నయనతార, లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు.

Next Story