జీవితం అంటే కేవలం పెళ్లి మాత్రమే కాదు.. అంతకు మించి చాలా ఉంది: కృతి సనన్

by Mallepaka Hamsa |

జీవితం అంటే కేవలం పెళ్లి మాత్రమే కాదు, అంతకు మించి చాలా ఉంది. నా పెళ్లి ఎప్పుడు చేసుకోవాలనేది నా ఇష్టం.

జీవితం అంటే కేవలం పెళ్లి మాత్రమే కాదు.. అంతకు మించి చాలా ఉంది: కృతి సనన్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ బ్యూటీ కృతి సనన్ ప్రస్తుతం వరుస హిట్లతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించడమే కాకుండా, నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా యూకే వ్యాపారవేత్త కబీర్ బహియాతో ఈమె ప్రేమాయణం సాగిస్తోందనే వార్తలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. ఈక్రమంలో.. తాజాగా ఢిల్లీలో జరిగిన ఒక సమ్మిట్‌లో పాల్గొన్న కృతి తన పెళ్లిపై ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. "మీ చెల్లెలు నూపుర్ సనన్ పెళ్లి వీడియోలు చూశాం కదా, మరి మీ పెళ్లి వీడియోలు ఎప్పుడు చూస్తాం?" అని సరదాగా యాంకర్ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కృతి ఒక్కసారిగా షాక్ అవ్వడమే కాకుండా, కాస్త చిరాకు పడింది. "జీవితం అంటే కేవలం పెళ్లి మాత్రమే కాదు, అంతకు మించి చాలా ఉంది. నా పెళ్లి ఎప్పుడు చేసుకోవాలనేది నా ఇష్టం. దానికి సరైన సమయం వచ్చినప్పుడు, నా కండిషన్స్ ప్రకారమే చేసుకుంటాను. ప్రస్తుతానికి నాకు ఎలాంటి తొందర లేదు" అని ఆమె తేల్చి చెప్పారు.

గత కొంతకాలంగా కృతి సనన్ యూకేకి చెందిన వ్యాపారవేత్త కబీర్ బహియాతో డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా, కబీర్ పుట్టినరోజున కృతి పెట్టిన రొమాంటిక్ పోస్ట్ ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది. కబీర్ కుటుంబానికి టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ధోనీతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే తన రిలేషన్‌షిప్ గురించి కృతి ఇప్పటివరకు అధికారికంగా ఎక్కడా నోరు విప్పలేదు. కాగా.. ఈ అమ్మడు సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం కృతి సనన్ కెరీర్ పరంగా ఫుల్ జోష్‌లో ఉంది. ఈ ఏడాది విడుదలైన ‘తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా’, ‘క్రూ’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించాయి. త్వరలో ఆమె షాహిద్ కపూర్, రష్మిక మందన్నలతో కలిసి ‘కాక్ టెయిల్ 2’లో నటించనుంది. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండటంతో ఇప్పుడప్పుడే పెళ్లి గురించి ఆలోచించే ఉద్దేశం లేదని కృతి తన సమాధానంతో స్పష్టం చేశారు.

Next Story