- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా జీవితం, ప్రేమ రెండూ గందరగోళంగా ఉన్నాయి.. హీరోయిన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
మిథిలా పాల్కర్(Mithila Palkar), రుద్ర జంటగా నటించిన సినిమా ‘ఓహో ఎంతన్ బేబీ’(Oho Enthan Baby).

దిశ, సినిమా: మిథిలా పాల్కర్(Mithila Palkar), రుద్ర జంటగా నటించిన సినిమా ‘ఓహో ఎంతన్ బేబీ’(Oho Enthan Baby). ఇందులో రుద్ర, అంజు, రెడిన్ కింగ్‌స్లీ(Redin Kingsley) కీలక పాత్రలో కనిపించారు. ట్విస్ట్, రొమాన్స్ డ్రామా.. అన్ని ఉన్నప్పటికీ హ్యాపీ ఎండింగ్ లేకుండా ఎమోషనల్‌గా సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కృష్ణకుమార్ రామ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని విష్ణు విశాల్ నిర్మించారు. ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ జులై 11న థియేటర్స్‌లోకి వచ్చి ప్రేక్షకులను అలరించింది. తాజాగా, ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైనట్లు తెలుపుతూ మిథిలా పాల్కర్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రకటించింది. ఈ మూవీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. ఆగస్టు 8 నుంచి తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతుంది. ఇక ఈ పోస్ట్‌కు మిథిలా.. ‘‘జీవితం, ప్రేమ గందరగోళంగా ఉన్నాయి. ఓమో ఎంతన్ బేబీ మీ ముందుకు రాబోతుంది’’ అనే క్యాప్షన్ జత చేసింది.






