- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గతం నేర్పిన పాఠం.. భయంకరమైన భవిష్యత్తు.. ‘తుంబాడ్-2’ విడుదల తేదీ ప్రకటించిన మేకర్స్
గతం నేర్పిన పాఠం.. భయంకరమైన భవిష్యత్తు.. ఆకలి పెరుగుతోంది, దురాశ వారసత్వం కొనసాగుతుంది.

దిశ, సినిమా: భారతీయ చలనచిత్ర రంగంలో సరికొత్త హారర్ ట్రెండ్‌ను సృష్టించిన సినిమా ‘తుంబాడ్’ . ఈ మూవీ కోసం ఏళ్ల తరబడి వేచి చూస్తున్న అభిమానులకు చిత్ర బృందం ఎట్టకేలకు ఒక క్రేజీ అప్‌డేట్ అందించింది. ‘తుంబాడ్ 2’ విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 3, 2027న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 2024లో ‘తుంబాడ్’ రీ-రిలీజ్ అయినప్పుడు బాక్సాఫీస్ వద్ద అది సృష్టించిన సునామీ అందరికీ తెలిసిందే. ఆ ఊపుతోనే హీరో, నిర్మాత సోహం షా ఈ సీక్వెల్‌ను అత్యంత భారీ స్థాయిలో ప్లాన్ చేశారు. "గతం నేర్పిన పాఠం.. భయంకరమైన భవిష్యత్తు.. ఆకలి పెరుగుతోంది, దురాశ వారసత్వం కొనసాగుతుంది" అనే పవర్‌ఫుల్ క్యాప్షన్‌తో రిలీజ్ చేసిన కొత్త పోస్టర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.
ఈసారి కేవలం వినాయక్ రావు కథ మాత్రమే కాకుండా, హస్తర్ పురాణాలలోని మరిన్ని రహస్యాలను చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సీక్వెల్‌లో మరో బిగ్ సర్ప్రైజ్ ఏమిటంటే, వర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖీ ఒక కీలక పాత్రలో నటించబోతున్నారు. సోహం షా, నవాజుద్దీన్ వంటి ఇద్దరు పవర్‌ఫుల్ నటులు తోడవ్వడంతో ఈ సినిమా నటన పరంగా కూడా నెక్స్ట్ లెవల్‌లో ఉండబోతోందని అర్థమవుతోంది. ముంబైలో సుమారు 8 ఎకరాల భారీ సెట్ వేసి, ఒక నగరాన్నే సృష్టించి షూటింగ్ జరుపుతున్నట్లు తెలుస్తోంది. మొదటి భాగానికి సహ-దర్శకత్వం వహించిన ఆదేశ్ ప్రసాద్ ఈ సీక్వెల్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. పెన్ స్టూడియోస్ అధినేత జయంతిలాల్ గడ ఈ చిత్రాన్ని సమర్పిస్తుండగా, పెన్ మరుధర్ పంపిణీ బాధ్యతలు చేపట్టారు. భారతీయ సినిమాలో ఒక మైలురాయిగా నిలిచిన హారర్ వరల్డ్, 2027 చివరిలో ప్రేక్షకులను భయపెట్టేందుకు సిద్ధంగా ఉంది.






